ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 15:46:35

ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా

క‌డ‌ప జిల్లాలో రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కుతున్నాయి... ఇప్ప‌టికే పార్టీ ఫిరాయించి త‌ప్పు చేశాను అని బాధ‌ప‌డుతున్న ఎమ్మెల్యేల జాబితాలో ముందు ఉన్నారు క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఎమ్మెల్యే జ‌య‌రాములు... అయితే అన‌వ‌స‌రంగా పార్టీ మారాను అని బ‌హిరంగంగా చెప్పారు ఆయ‌న‌. ఇక ఇప్పటికే అనేక స‌మ‌స్య‌లు అక్క‌డ పార్టీ కేడ‌ర్ లో పెరిగిపోతున్నాయి.తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు క్లాస్‌ తీసుకున్నా కడప జిల్లా తెలుగుతమ్ముళ్లలో మార్పు రావడం లేదు. వర్గ విభేదాలు...ఆధిపత్యపోరుతో అధినేతకు తలనొప్పులు తెస్తున్నారు జిల్లా నాయ‌కులు.
 
బద్వేల్‌ నియోజకవర్గం ఎపిసోడ్‌ పార్టీకి పెద్ద సమస్యగా మారింది.. పేరుకు ఇది ఎస్సీ నియోజకవర్గమే అయినా అక్కడ అగ్రవర్ణాల డామినేషనే ఎక్కువట ఇదే ఇక్క‌డ ఎమ్మెల్యే బాధ‌గా క‌నిపిస్తోంది...బద్వేల్‌లోనూ చాలా కాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది.. మొత్తంగా అక్కడ టీడీపీలో మూడు గ్రూపులున్నాయి.. ప్రధానంగా మాజీమంత్రి వీరారెడ్డి కూతురు, మాజీ ఎమ్మెల్యే అయిన విజయమ్మ గ్రూపు ఎప్పట్నుంచో ఆధిపత్యం చలాయిస్తోంది.. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వీరారెడ్డి బద్వేల్‌కే పరిమితం కాకుండా జిల్లా రాజకీయాలను కూడా శాసించారు. వీరారెడ్డి మరణానంతరం ఆయన కుమార్తె విజయమ్మకు బద్వేల్‌ ప్రజలు పట్టం కట్టారు.
 
నాటి నుంచి ఆమె ఆధిపత్యమే కొనసాగుతోంది. ఆ తర్వాత బద్వేల్‌ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వయ్యింది. గత ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి విజయజ్యోతిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి జయరాములు విజయం సాధించారు. ఆ తర్వాత జయరాములు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశంపార్టీలో చేరారు. దీంతో బద్వేల్‌ టీడీపీలో మూడు గ్రూపులు తయారయ్యాయి. విజయమ్మ...విజయజ్యోతి... ఎమ్మెల్యే జయరాములు ఎవరికి వారు గ్రూపులు మెయింటైన్‌ చేస్తున్నారు.
 
అయితే గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు. అధికార కార్యక్రమాలకు జయరాములు దూరంగా ఉంటున్నారు. ఇక ఎస్సీ నియోజ‌క వ‌ర్గాలు అన్నింటిలో అగ్ర‌వ‌ర్ణాల ఆధిప‌త్యం పెరిగిపోతోంది అని బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు..దీనిపై సీఎంకు ఎవ‌రి వాద‌న వారు వినిప‌స్తున్నారు జిల్లా మంత్రి సీఎం ఎటువంటి మాట చెప్ప‌డం లేదు అని ఆయ‌న వాపోతున్నారు.
 
అధికార పార్టీలోకి ఫిరాయించినా తన నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి విజయమ్మ ఆధిపత్యమే  ఇక్క‌డ కొన‌సాగిస్తున్నారు అని విమ‌ర్శిస్తున్నారు . నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మేళ్లు చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తపరిచారు. ఎస్సీ నియోజకవర్గంపై అగ్రవర్ణాల పెత్తనేమిటంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు..
 
ఇక ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను అని చెప్పినా ఇక్క‌డ తెలుగుదేశం ఎటువంటి న‌ష్ణ‌నివార‌ణ చర్య‌లు చేయ‌డం లేదు దీనికి ముఖ్య‌కార‌ణం ఆయ‌న‌కు ఎమ్మెల్యేగా అనుభ‌వం లేదు, అలాగే కేడ‌ర్ లేదు అట, అందుకే ఆయ‌న పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్ద ఆలోచించ‌న‌వ‌స‌రం లేదు అని తెలుగుదేశం భావిస్తోంది అని తెలుస్తోంది.. అంతే కాని ఈ ఆధిప‌త్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్ట‌డం లేదు.. ఇక ఆయన కూడా ఈ వారంలో ఓ డెసిష‌న్ తీసుకుంటారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.