పాద‌యాత్ర‌లో అప‌శృతి జ‌గ‌న్ దిగ్భాంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 03:29:20

పాద‌యాత్ర‌లో అప‌శృతి జ‌గ‌న్ దిగ్భాంత్రి

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొన‌సాగిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో అప‌శృతి చోటు చేసుకుంది. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని చిన్న‌వ‌డుగూరు గ్రామానికి చెందిన రంగా రెడ్డి అనే వైసీపీ అభిమ‌ని నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొనేందుకు వ‌చ్చారు.

అయితే శనివారం నాడు ఉద‌యం నెల్లూరు జిల్లా ఓజిలి మండ‌లం గుర్రంకొండ గ్రామం స‌మీపంలో జ‌రుగుతున్న పాద‌యాత్ర‌లో రంగారెడ్డికి (50) గుండెపోటు వ‌చ్చింది. దీంతో హుటా హుటినా ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించేలోగా మృతి చెంద‌డం దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న‌. ఈ విష‌యం తెలుసుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. త‌మ‌ను, పార్టీని అంత‌లా అభిమానించే వ్య‌క్తి చ‌నిపోవ‌డాన్ని జీర్నించుకోలేక తీవ్ర ఉద్రిక్త‌త‌కులోనై చాలా సేపు బాధ‌ప‌డ్డారు. రంగారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.