బాబు ప‌బ్లిసిటి కోసం ఇంత దారుణానికి పాల్ప‌డుతారా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

srikanth reddy,chandrababu image
Updated:  2018-04-01 11:51:16

బాబు ప‌బ్లిసిటి కోసం ఇంత దారుణానికి పాల్ప‌డుతారా

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రజాసమస్యలు ప‌రిష్కారిస్తూ సుప‌రిపాల‌న అందించాల్సిన బాద్య‌త ప్ర‌భుత్వానిదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం స‌ర్కార్ ప్రజాసమస్యలు ప‌రిష్క‌రించ‌కుండా ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని అన్నారు.  
 
తెలుగుదేశం పార్టీ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకుంటూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోంద‌ని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష పార్టీలేన‌ప్పుడు చంద్రబాబు గంటల తరబడి  ఉపన్యాసాల ఇవ్వ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ప్రతిపక్షం సభలో లేదనే ధైర్యంతో అసెంబ్లీని టీడీపీ సమావేశాల వేదికలా మార్చేశారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిప‌డ్డారు.
 
వైయ‌స్సార్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రుణమాఫీ జరగక అన్నదాతలు, డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అసెంబ్లీలో  చర్చించకపోవడం దారుణం అని అన్నారు. ప్రతి బీఏసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై చర్చించాలని వైఎస్సా ర్‌సీపీ డిమాండ్ చేసిన‌ పరిగణనలోకి తీసుకో లేదని ఆయ‌న తెలిపారు. ప్రజా సమస్యలను చ‌ర్చించ‌డానికి అసెంబ్లీను రెండు రోజులు పొడిగించాలని కోరినా కనీసం ప‌రిశీలించ‌లేద‌ని అన్నారు.
 
ప్ర‌తిప‌క్షం లేన‌ప్పుడు చంద్ర‌బాబును పొగిడించు కోవడం కోసం అసెంబ్లీని పొడిగించారన్నారు.తెలుగుదేశం పార్టీ రాజ్యంగానికి తూట్లుపోడుస్తూ స‌భ‌ను న‌డుపుతున్న విధానాన్ని శ్రీకాంత్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. సీఎం చంద్ర‌బాబు పబ్లిసిటీ కోసం ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని  శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్నారని, ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయ ప్రమాదంలో నలుగురిని పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. ఒంటిమిట్ట ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించాలని వైసీపీ తరుపున ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.