జ‌గ‌న్ చేతికి ఎన్నికుట్లు వేశారో తెలుసా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-10-25 17:37:34

జ‌గ‌న్ చేతికి ఎన్నికుట్లు వేశారో తెలుసా...

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరో శివాజి గ‌తంలో చెప్పిన ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా ఆయ‌న చెప్పిన విధంగా తూచా త‌ప్ప‌కుండా జ‌రుగుతున్నాయి. గ‌తంలో శివాజి చెప్పిన మాట‌లు ఇటు అధికార నాయ‌కులతో పాటు అటు ప్ర‌తిపక్ష నాయ‌కులు కూడా ఫిలిమ్ స్క్రిఫ్ట్ గా భావించారు. కాని ఇప్పుడు ఆయ‌న చెప్పిన విష‌యాలే నిజం అవుతుంటే అంద‌రు భ‌యాందోళ‌న‌కు గురి అవుతున్నారు. 
 
తాజాగా ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.. ఈ దాడిలో వైఎస్ జ‌గ‌న్ ఎడ‌మ చేతికి తీవ్ర ర‌క్త స్రావం అయింది. సెల్ఫీ కోసం వ‌చ్చిన శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి, జ‌గ‌న్ పై దాడి చేయ‌డం రాష్ట్ర‌రాజ‌కీయ నాయ‌కులను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. 
 
ఇక ఈ దాడిలో గాయ‌ప‌డిన జ‌గ‌న్ విశాఖ నుంచి విమానంలో హైద‌రాబాద్ కు చేరుకుని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ముందుగా డాక్ట‌ర్లు చెక‌ప్ కోసం జ‌గ‌న్ బ్ల‌డ్ ను తీసుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత గాయం అయిన ఎడ‌మ చేతికి శ‌స్త్ర‌చిత్స చేసి మూడు కుట్లు వేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు