టీడీపీకి షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 18:40:20

టీడీపీకి షాక్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో వైసీపీలోకి వ‌ల‌స‌లు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక‌ ఈ వ‌ల‌స‌లను తగ్గించేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ వైసీపీలోకి వ‌ల‌స‌లు మాత్రం ఆగ‌డంలేదు. దీంతో చంద్ర‌బాబుకు ఏం చేయాలో దిక్కు తోచ‌టంలేద‌ట‌.
 
ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు తండోప తండాలుగా ప్ర‌జ‌లు వ‌చ్చేది చూసి క‌చ్చితంగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని భావించి టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
ఇక ఇప్ప‌టికే కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి, అలాగే ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌లు వ‌సంత కుటుంబం కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  ఇక తాజాగా టీడీపీ మాజీ శాసనసభ్యుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా రేపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోన్నారు.
 
ఇక ఇదే క్ర‌మంలో మ‌రో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జిల్లా పరిష‌త్ మాజీ ఉపాధ్య‌క్షుడు డాక్ట‌ర్ మ‌న్నే ర‌వీంద్ర కూడా త్వ‌ర‌లో టీడీపీకి గైడ్ బై చెప్పి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇక ఇప్ప‌టికే ఆయ‌న స‌న్నిహితుల‌తో చ‌ర్చించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపుకోసం నిరంత‌రం కృషి చేసినా చంద్ర‌బాబు గుర్తించ‌లేద‌ని ర‌వీంద్ర బాధ‌ప‌డుతున్న నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ర‌వీంద్ర వారికి అందుబాటులోకి రాలేదు.
 
ఇక చివ‌రికి గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర ప్రసాద్‌, ర‌వీంద్ర వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకొని ఆయ‌న‌ను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. దీంతో తన నిర్ణయాన్ని మార్చుకొని ఉంటారని అందరూ భావించారు. కానీ శుక్రవారం జరిగిన జిల్లా మహానాడుకు హాజరు కాలేదు. అంతేకాదు ఎర్రగొండపాలెంలోనే ఉండి ఏఎంసీ చైర్మన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. దీంతో ఆయ‌న క‌చ్చితంగా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.