ధూళిపాళ్లకు సరికొత్త చిక్కులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 03:53:56

ధూళిపాళ్లకు సరికొత్త చిక్కులు

గుంటూరు జిల్లా తెలుగుదేశంలో ఆ నాయ‌కుడు కీరోల్ పోషిస్తాడు.. ఇక్క‌డ జిల్లాలో సీనియ‌ర్ తెలుగుదేశం నేత‌గా ఓ బ్రాండింగ్ తెచ్చుకున్న నాయ‌కుడు.. గుంటూరు జిల్లా పొన్నూరులో వ‌రుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ రికార్డులు సృష్టిస్తున్న నాయ‌కుడు.. పోటికి ఎవ‌రు ఉన్నా తానే గెలుపు గుర్రాన్ని అంటూ స‌వాల్ చేస్తున్న తెలుగుదేశం నాయ‌కుడు ధూళిపాళ్ల న‌రేంద్ర ....పొన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా 1994 మొదలుకుని ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన టీడీపీ నేత‌గా, ఆయ‌న ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు.  తండ్రి దివంగత ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు ఈ డైన‌మిక్ ఎమ్మెల్యే.
 
అంత‌టి కాంగ్రెస్ నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌రిష్మా స‌మ‌యంలో కూడా ముందుకు వెళ్లారు జిల్లాలో ధూళిపాళ్ల‌...అలాగే పార్టీ త‌ర‌పున జిల్లాలో క్రియాశీల‌కంగా ఉండేవారు...రాష్ట్రం అంతా  కాంగ్రెస్ గాలి వీచినా,  2004 లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం త‌ర‌పున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించాడు..2014 లో తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంతో జిల్లా నుంచి ధూళిపాళ్ల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అని  అనుకున్నారు.. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు మొండిచెయ్యి చూపారు.... ఇక రెండ‌వ ట‌ర్మ్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో  ఆయ‌న పేరు ఫైన‌ల్ అయింది అనుకునే స‌మ‌యంలో కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు చంద్ర‌బాబు.
 
ఇక జిల్లాలో సీనియ‌ర్ గా ఉన్నా, జిల్లా రాజ‌కీయాల్లో వేలుపెట్ట‌రు.. ఇతర సెగ్మెంట్ల జోలికి పోరు. వివాదాల‌కు అర‌వై అడుగుల దూరంలో ఉంటారు ధూళిపాళ్ల... దీంతో పార్టీ త‌ర‌పున ఆయ‌న‌కు మంచి ఇమేజ్ ఉంది... అయినా చంద్ర‌బాబు ఇవ‌న్ని గుర్తించ‌కుండా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు అనే రాజకీయ వేద‌న‌ ఉంది ఆయ‌న‌లో అంటారు ఆయ‌న అభిమానులు.
 
ఇక ఐదుసార్లు విజ‌యం అందుకున్న ధూళిపాళ్ల ,ఈ సారి మ‌రింత మెజార్టీతో విజ‌యం అందుకుంటారు  అని అనుకుంటుంటే. ఇక్క‌డ దీనికి రివ‌ర్స్ వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఆయ‌న ఈ సారి ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశం లేదు అంటున్నారు నాయ‌కులు.... దానికి రాజ‌కీయంగా కాకుండా భౌగోళిక ప‌రిస్ధితులు కార‌ణం  అంటున్నారు.
 
!! దీనికి ప్ర‌ధాన కార‌ణం !!  
ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఒక‌వేళ  జ‌రిగితే  ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి  ఉన్న ప్రాంతం ఆ జిల్లా, కాబ‌ట్టి ఇక్క‌డ పెద్ద ఎత్తున ఫోక‌స్ చేస్తుంది ఏపీ స‌ర్కార్.. అందులోనూ ఇక్క‌డ పొన్నూరు చాలా ఏళ్లుగా జ‌న‌ర‌ల్ కోటాలో ఉంది..దీంతో కొన్ని మండ‌లాల సమూహంతో ఇక్క‌డ రిజ‌ర్వ్ చేయాలి అని భావిస్తోంద‌ట తెలుగుదేశం .. అయితే ఈ స‌ర్కారు సెగ్మెంట్ల  చేర్పు మార్పు ప‌ద్ద‌తి  అంతా.... క‌లెక్ట‌ర్లు చెప్పిన విధంగా జ‌రుగుతుంది.. ఇక్క‌డ రిజ‌ర్వ్ గా ఈ సెగ్మెంట్ చేర్చ‌బ‌డితే ,ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు ఛాన్స్ ద‌క్క‌క‌పోవ‌చ్చు అంటున్నారు సొంత‌గూటి నేత‌లు.
 
పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ ను ప‌రిశీలిస్తే, ఇక్క‌డ పొన్నూరు మున్సిపాల్టీతో పాటు పొన్నూరు రూర‌ల్, చేబ్రోలు, పెద‌కాకాని మండ‌లాలు భాగంగా ఉన్నాయి. ఇక గుంటూరు సెంట‌ర్ గా సెంట్ర‌ల్ సెగ్మెంట్ ఏర్పాటు చేయాల‌ని, బాబు ఆలోచ‌న చేస్తున్నారు రాజ‌ధాని ప్రాంతంలో... దీంతో గుంటూరుకు కేవ‌లం ఐదు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పెద‌కాకాని మండ‌లాన్ని పొన్నూరు నుంచి వేరు చేస్తారు అనే వార్తలు జిల్లాలో వినిపిస్తున్నాయి.
 
ఇక అలాగే ప్ర‌త్తిపాడు సెగ్మెంట్ పై కూడా బాబు గురిపెట్టారు అని తెలుస్తోంది.. ప్ర‌త్తిపాడులో ఉన్న కాక‌మాను మండ‌లంలో ద‌ళిత ఓట‌ర్లు అధికంగా ఉన్నారు.. వారు తెలుగుదేశానికి మెజార్టీ ఉన్నారు..  దీంతో ఆ మండ‌లాన్ని కూడా పొన్నూరు లో క‌లిపి  పొన్నూరు ను రిజ‌ర్వ్ నియోజ‌క‌ర్గం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోంది సైకిల్ పార్టీ.. దీంతో ఆరోసారి ఎమ్మెల్యే అవుదాము అనుకున్న ధూళిపాళ్ల‌కు, ఈ సారి ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం లేదు అని జిల్లా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.