ఉభ‌య గోదావ‌రి జిల్లాల రిపోర్ట్ జ‌గ‌న్ కు ఏమ‌ని వ‌చ్చిందంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-08-16 04:41:43

ఉభ‌య గోదావ‌రి జిల్లాల రిపోర్ట్ జ‌గ‌న్ కు ఏమ‌ని వ‌చ్చిందంటే

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర టీడీపీకి కంచుకోట‌గా నిలిచిన ఉభ‌య గోదావరి జిల్లాల్లో కొద్దిరోజుల క్రితం దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా పోవ‌డానికి కార‌ణం ఆ రెండు జిల్లాలే కీలకం అని చెప్పాలి.  
 
దీంతో జ‌గ‌న్ ఎక్క‌డ పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాలి అనే సామెత‌ను బాగా న‌మ్మి పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఈ జిల్లాల్లో స్పీడును పెంచారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కుల అంచ‌నాల్సి ప‌టాపంచ‌లు చేస్తూ త‌నదైన‌ శైలిలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో అధికార నాయ‌కులు చేస్తున్న అరాచ‌కాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ జ‌గ్గంపేటకు చేరుకోగానే కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై క్లారిటీ ఇచ్చారు. రిజ‌ర్వేష‌న్లు అన్న‌ది కేంద్ర పరిధిలో ఉన్న అంశం కాబ‌ట్టి తాను త‌న ఆధీనంలో లేనిది తాను అమ‌లు చేస్తాన‌ని చెప్ప‌న‌ని, అధికారం కోసం త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించ‌న‌ని అందుకే తాను రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు. 
 
అంతేకాదు కాపు కార్పోరేష‌న్ కింద ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎంత మేర‌కు నిధుల‌ను ఇస్తున్నారో తాను అంతకంటే ఎక్క‌వ నిధుల‌ను కేటాయిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇక జ‌గ‌న్ మాట్లాడిన మాట‌ని త‌ప్పుబ‌డుతూ వివాదాస్ప‌దం చేశారు టీడీపీ నాయ‌కులు. కాపు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చెయ్యాలంటే అది టీడీపీ వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని ప్ర‌చారం చేశారు. దీంతో ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కొద్ది మేర‌కు నీర‌సంగా సాగింది. ఆ త‌ర్వాత కాపు వ్వ‌వ‌హ‌రం స‌ర్దుకుపోవ‌డంతో పాద‌యాత్ర దిగ్విజ‌యంగా సాగింది. 
 
ఒక వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర మ‌రో వైపు అంత‌ర్గ‌త స‌ర్వేను ముమ్మ‌రంగా సాగించారు. ఈ మేర‌కు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల స‌ర్వే రిపోర్ట్ ను అధినేత‌కు అందించిన‌ట్లు తెలుస్తోంది.. ఈ స‌ర్వే ప్ర‌కారం ఈ రెండు జిల్లాలు గ‌తంలో లాగ కాకుండా వైసీపీ ఇంపాక్ట్ చాలా బ‌లంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. స‌గానికి స‌గం పైగా వ‌చ్చేఎన్నిక‌ల్లో వైసీపీ దిగ్విజ‌యం సాధిస్తుంద‌ని ఇక మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరా హోరీ త‌ప్ప‌ద‌ని తెలిపింది. ఇక ఈ స‌ర్వేను గ‌మ‌నించిన తెలుగు త‌మ్ముళ్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఏ గ‌తికి చేరుతుందోన‌ని భ‌యాందోళ‌న‌ చెందుతున్నారు.

షేర్ :

Comments

4 Comment

  1. Dhaya chasi party lo eppati nundo panichesina. Old meance patha vallaki gurthimpu ivvandi please.pedana lo uppala ramprasadh ki ivandi

    Plz change the chinthalapudi ysrcp co ordinator.otherwise we will loss.

    Plz change the chinthalapudi ysrcp co ordinator.otherwise we will loss.

    cc

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.