ప‌శ్చిమ‌లో ఇద్ద‌రు చేరారు.. తూర్పుగోదావ‌రిలో క్యూ ఎంతమంది ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-14 15:56:27

ప‌శ్చిమ‌లో ఇద్ద‌రు చేరారు.. తూర్పుగోదావ‌రిలో క్యూ ఎంతమంది ?

జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర కృష్ణా నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప్ర‌వేశించిన త‌ర్వాత‌.. జిల్లాలో ప్ర‌జ‌లను మ‌రింత ఉత్తేజ‌ర‌పిర‌చారు వైయ‌స్ జ‌గ‌న్.. ఇక వైయ‌స్ జ‌గ‌న్ పై ప్రేమ అనురాగాలు చూపుతూనే ఉన్నారు జ‌నం ప్ర‌త్యేకంగా...ఇక వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ కు నీరాజ‌నాలు ప‌లుకుతూనే ఉన్నారు.. 
 
ప‌శ్చిమ‌లో జ‌గ‌న్ కు వ‌చ్చిన స్పంద‌న చూస్తే తెలుగుదేశానికి కూడా దిమ్మ‌తిరిగింది. అయితే పార్టీ నాయ‌కులు ఎటువంటి కామెంట్లు ఎక్క‌డా చేయ‌కుండా పాద‌యాత్ర త‌ర్వాత స్వ‌రం పెంచారు.. ఇక కొంద‌రు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్ర‌దేశంలో చాక్లెట్లు పంచ‌డం కూడా తెలిసిందే.
 
ఇటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైసీపీలో జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరారు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు. విద్యావేత్త గుబ్బల తమ్మయ్య. వీరిద్ద‌రిలో రంగ‌నాథ‌రాజు వైసీపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి  చేరితే.. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి గుబ్బల తమ్మయ్య ఫ్యాన్ పార్టీలో చేరారు... అయితే జిల్లాలో సిట్టింగ్ లు మాజీలు భారీగా చేరుతారు అని అనుకుంటే ఇలా జ‌రిగింది ఏమిటి అని టీడీపీ ట్రోల్ చేస్తోంది.. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు కూడా స‌రైన కౌంట‌ర్లు ఇస్తున్నారు... వైసీపీ ఫిరాయింపుల‌కు టీడీపీ మాదిరిగా ప‌చ్చ తివాచీ ప‌ర‌చ‌లేదు అని విమ‌ర్శిస్తోంది.
 
ఇక ప‌శ్చిమ‌లో ఇద్ద‌రు చేరి ఓఅసెంబ్లీ టికెట్ పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.. జ‌గ‌న్ ఒక‌రికి క‌చ్చిత‌మైన హామీ కూడా ఇచ్చారుఇప్ప‌టికే..ఇక మిగిలింది తూర్పుగోదావ‌రి జిల్లా, ఇప్ప‌టికే నాయ‌కులు వైసీపీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు..పాద‌యాత్ర విశాఖ‌కు వైసీపీ విశాఖ ఎక్సెప్రెస్ లా దూసుకుపోతుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.