ఏపీలో ఉప ఎన్నిక‌ల‌పై ఈసీ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

andhra pradesh
Updated:  2018-10-09 03:58:03

ఏపీలో ఉప ఎన్నిక‌ల‌పై ఈసీ క్లారిటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్ రావు, మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మూకుమ్మడిగా పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరిక మేర‌కు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. వీరు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో ఏపీలో ఐదు లోక్ స‌భ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ ఐదు స్థానాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో వ‌ర్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే తాజాగా ఈ వార్త‌లపై ఎన్నిక‌ల సంఘం స్పందించింది. క‌ర్నాట‌క‌లోని బ‌ళ్లారి, షిమోగ, మిండ్య లోక్ స‌భ స్థానాలు మే18, 21 నాటికే ఖాళీ అయ్యాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దే లోక్ స‌భ ఐదు స్థానాలు జూన్ 20న‌ ఖాళీ అయ్యాయ‌ని తెలిపింది. అయితే రాజ్యాంగ చ‌ట్టం సెక్ష‌న్ 151  ప్ర‌కారం ప‌ద‌వీకాలం ఏడాదికంటే ఎక్కువ‌గా ఉన్నప్పుడు ఏవ‌రైనా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తే అప్పుడు  ఆరునెలల్లోపు ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని తెలిపింది. 
 
క‌ర్నాట‌క లోక్ స‌భ స్థానాలు అంత‌కంటే ముందే ఖాళీలు ఏర్ప‌డ‌టంతో అక్క‌డ ఉపఎన్నిక‌లు అనివార్యం అయింద‌ని ఈసీ వెళ్ల‌డించింది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లోక్ స‌భ స్థానాలు జూన్ 20న‌ ఖాళీ కావ‌డంతో ప‌ద‌వీ కాలం ఏడాదిలోపు ఉండ‌టంతో ఏపీలో ఉప ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అవ‌స‌రం లేద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.