ఈడీ దెబ్బకి ఒక్కటి బయటకొస్తున్న చీమలు..అంతా టీడీపీ తొత్తులే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-10-11 04:02:21

ఈడీ దెబ్బకి ఒక్కటి బయటకొస్తున్న చీమలు..అంతా టీడీపీ తొత్తులే

శ్రీనివాస్ కళ్యాణ్ రావు, సీబీఐ మాజీ డైరక్టర్, టిఆరెస్ నేత, గతంలో టిడిపి మంత్రి విజయ రామారావు తనయుని నివాసంతో పాటు, ఆయనకే చెందిన మరిన్ని కంపెనీల్లో నూ ఈడీ ఇటీవల నిశిత తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో ఇతరులకు చెందిన పలు సంస్థల్లో కూడా ఈడీ తనిఖీలు సాగాయి అంటున్నారు. ఇప్పటికే విజయ రామారావు తనయుడు శ్రీనివాస కళ్యాణరావు పై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా దాని ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈడీ - ఐటీ సోదాలు ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలను కలవరపెడుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డిపై ఐటీ-ఈడీ సోదాలు నిర్వహించడం, ఆంధ్రప్రదేశ్ లో కొందరు రాజకీయ నేతలు-వ్యాపార వేత్తల సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుండి దారిమళ్ళించిన సొమ్ము సుజానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోకి వచ్చిచేరినట్లు అనుమానిస్తు న్నాయి నిఘాసంస్థలు.

ఈ క్రమం లోనే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన మరో అధికార పార్టీ నేత పై ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ - కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కి చెందిన సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై ఈడీ సోదాలు నిర్వించినట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సోదాలు జరిగాయని తెలుస్తోంది.34మంది ఈడీ అధికారులు నాగార్జున హిల్స్ ప్రాంతంలో ఉన్న సుజనా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారని తెలుస్తోంది.

ఒకే అడ్రస్ నుంచి నడుపుతోన్న 120 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. బెస్ట్ - క్రాంప్టన్ కంపెనీ లకు సంబంధించిన ₹1000కోట్ల విలువైన మోసపూరిత బ్యాంక్ ఋణ పత్రాలను డాక్యుమెంట్లను కూడా స్వాధీనం" చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఆ డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని రబ్బరు స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నారట. బెస్ట్ క్రాంప్టన్ కంపెనీల నుంచి సుజనా గ్రూపునకు నిధులు మళ్లించినట్లుగా సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు సంపాదించారట. వివిధ ఆస్తిపాస్తులకు సంబంధించిన పత్రాలు 20లక్షల నగదు ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.