వైసీపీలోకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-13 01:57:26

వైసీపీలోకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌స్తుతం షాక్ ల మీద షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి. ఒక‌ప్పుడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆసించి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో సుమారు 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయి టీడీపీ  గాలి కాస్త వైసీపీ వైపు మ‌ళ్లిందనే చెప్పాలి. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయల‌ దృష్ట్యా  వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని తాజా విశ్లేష‌కుల స‌మాచారం.
 
ఇక ఇప్ప‌టికే కృష్ణా జిల్లా నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే సీనియ‌ర్ నేత, హోం శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్, కూడా త‌న అనుచ‌రుల‌తో వైయ‌స్సార్  కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక దీంతో పాటు రెండు సంవ‌త్స‌రాల క్రితం వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మ‌రికొద్ద‌ రోజుల్లో తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్దారంగా ఉన్నార‌ని తెలుస్తోంది.
 
టీడీపీలోకి ఫిరాయించిన త‌ర్వాత రెండు సంవ‌త్స‌రాల పాటు సాఫిగా కాలం సాగించారు. ఇక 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై టీడీపీ నాయ‌కులు అనుచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. దీంతో వారు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. తాము గ‌తంలో తీసుకున్న తోంద‌ర‌పాటు నిర్ణ‌యం వల్ల ఇప్పుడు ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని లోలోప‌లే కుమిలిపోతున్నార‌న‌ట ఫిరాయింపు ఎమ్మెల్యేలు.
 
 ఇక జ‌గ‌న్ హామీ ఇస్తే సుమారు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ తో మంత‌నాలు కూడా జ‌రిపార‌ట‌. కానీ జ‌గ‌న్ మాత్రం వారిని పార్టీ లో చేర్చుకునేందుకు సుముఖత చూప కున్నార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ స్ట్రాంగ్ నిర్ణ‌యంలో ప్ర‌స్తుతం ఫిరాయింపులు ఎటువంటి పొలిటిక‌ల్ నిర్ణ‌యం  తీసుకుందాము అనుకున్నా ఆచితూచి ఆలోచించ‌డానికి కూడా ఎటుంటి దారి క‌నిపించ‌డం లేద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన్న‌ట్లు తెల‌స్తోంది. మొత్తం మీద ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఎటూ తేల్చుకోలేని విధంగా మారింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.