టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 15:06:03

టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

2014 ఎన్నికలలో సుమారు 600 హామీలు ఇచ్చి అధికారం దక్కించుకుని నాలుగు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు టీడీపీకి దూరం అవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూ - టర్న్ రాజకీయాలు చేయడంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చింది..టీడీపీ నాయకులపై రోజుకొక అవినీతి ఆరోపణలు రావడం, జరుగుతున్న హత్యచారాలు చూసి ప్రజలు విసిగిపోయారు.
 
దీంతో ఎలాగైనా మళ్ళి ప్రజలను దగ్గరకు చేసుకోవడానికి, మాయ మాటలు చెప్పి మభ్యపెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు సభలు నిర్వహిస్తుంది టీడీపీ...ఈ సభలతో ప్రజలను మభ్యపెట్టాలని చూసిన టీడీపీకి ఒకవైపు షాక్ ఇస్తుంటే, చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వర్గ విభేదాలతో రెండుగా చీలిపోయి ఎవరికీ వారు మినీ మహానాడును నిర్వహించుకుంటున్నారు...
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏలూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు...జగన్ కి దమ్ముంటే వచ్చి ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని జగన్ కి సవాల్ విసిరారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి...
 
బడేటి బుజ్జి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు...వచ్చే ఎన్నికలలో నీకు సీటు వస్తుందో లేదో చూసుకో, తర్వాత గెలుపోటముల గురించి మాట్లాడుకుందాం అని ఎద్దేవా చేశారు వైసీపీ నాయకులు.నీ పైన పోటీ చేయడానికి మా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి అవసరం లేదు...నీ పైన కుక్కను నిలబెట్టినా సరే మేమే గెలుస్తాం అన్నారు..మీ నాయకుడికి గాని, మీకు గాని దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఎన్నికలకి రండి అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది అని మండిపడ్డారు వైసీపీ నాయకులు.

షేర్ :

Comments

1 Comment

  1. GUDDA LO DAMMU VUNTE PARTY MARI TDP LO KI VACHINA MLA LA CHETA RESIGN CHEYINCHI GELAVANDI CHUDDAMU. PICHI KUKKA MORUGULU MORIGITHE PRAJALU NAMMUTARU ANUKUNTUNNARAA.....

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.