జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 14:52:05

జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లను జ‌గ‌న్ ఎంతో ఆప్యాయంగా ప‌లుక‌రిస్తున్న తీరును చూసి చాలామంది త‌మ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 2019లో ముఖ్య‌మంత్రిగా పోటీ చెయ్య‌బోయే వ్య‌క్తి త‌మ‌ను సాధార‌ణ వ్య‌క్తిలా ప‌లుక‌రించ‌డం సంతోషంగా ఉంద‌ని అంటున్నారు. 
 
ఇక మ‌రికొంద‌రు అయితే బ‌హిరంగంగానే త‌మ ఓటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకే వేస్తామ‌ని చెబుతున్నారు. బడుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లకు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసే స‌త్తా ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని గ్ర‌హించి చాలా మంది జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
తాజాగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా రౌతుల‌పూడి మండ‌లం పారుపాక క్యాంప్ వ‌ద్ద ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు జ‌గ‌న్ స‌మక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ తీర్థం తీసుకునేందుకు వ‌చ్చిన కేన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూటూరి శ్రీనివాసరావుతో పాటు ప‌లువురు నాయ‌కులకు జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి స‌గ‌ర్వంగా ఆహ్వానించారు.
 
పార్టీ తీర్థం తీసుకున్న త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సుమారు ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క‌టంటే ఒక్క హామీను కూడా అమ‌లు చెయ్య‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నాలుగు సంవ‌త్స‌రాల నుంచి రాష్ట్రంలో రాక్ష‌స‌పాల‌న సాగుతోంది. ఈ రాక్ష‌స‌పాల‌న‌ను అంతమొందించేందుకు ప్ర‌తీ ఒక్క‌రు సిద్ద‌ప‌డాలి అని ఆయ‌న స్పష్టం చేశారు. అధికార బలంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న కుమారుడు అందిన కాడ‌కి రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌ని వారు మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.