జ‌గ‌న్ పై మాజీ సీఎం టార్గెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-06-27 05:36:46

జ‌గ‌న్ పై మాజీ సీఎం టార్గెట్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశంపార్టీ నాయ‌కులు ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేయడం స‌హజం. ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు అధికార‌నాయ‌కులను టార్గెట్ చేయ‌డం స‌హ‌జం. అయితే జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబు నాయుడు వారి టార్గెట్ కాద‌ట కేవ‌లం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే వారి టార్గెట్ అట‌. చ‌ద‌వ‌డానికి విచిత్రంగా ఉందిక‌దా! అయితే ఈ క్రింది విధంగా తెల‌సుకోండి.
 
తెలుగు రాష్ట్రాల చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గతంలో కాంగ్రెస్ పార్టీకి గుబై చెప్పి జై స‌మైఖ్యంధ్రా పార్టీని స్థాపించి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి ఘోర ప‌రాజ‌యాన్ని ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. 
 
ఇక ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కుల‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా ప‌ట్టు సాధించాల‌నే క్ర‌మంలో ముందు చూపు చూస్తున్నారు. అందుకే చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చి నాయ‌కులు తిరిగి పార్టీలో చేర్పించేందుకు అధిష్టానం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డిని ముందుగా పార్టీలో చేర్పించేందు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
 
కిర‌ణ్ కుమార్ రెడ్డికి రాజ‌కీయ గురువు అయిన దిగ్విజ‌య్ సింగ్ తో కూడా రీ ఎంట్రీపై చ‌ర్చించారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బరామిరెడ్డి కూడా కిర‌ణ్ కుమారెడ్డి ఇంటికి వెళ్లి సుమారు గంట‌పాటు చ‌ర్చించారు. ఈ చ‌ర్చ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కిర‌ణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని మీడియాకు తెలియచేశారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరితే ఏపీ కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న‌కే అప్పగించేందు రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారు. ఇక అంత‌కుమించి కిర‌ణ్ కుమార్ రెడ్డి జాతీయ రాజ‌కీయాల‌పై మ‌క్కువ ఉంటే ఆయ‌న కోరిక మేర‌కు జాతీయ రాజ‌కీయాల్లోకి తీసుకోవ‌డానికి కూడా రెడీ అవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. 
 
కానీ ఆయన‌ టార్గెట్ ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఉంద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే ఉద్దేశ్యంతో వ్యూహాలు ర‌చిస్తోన్నార‌ట‌ కిర‌ణ్ కుమార్ రెడ్డి. ఇక రాహుల్ కూడా జ‌గ‌న్ ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో రాజ‌కీయంగా ఎద‌గాలంటే తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ను టార్గెట్ చేసి వారిపై విమ‌ర్శ‌లు చేస్తే రాజ‌కీయంగా ఎదుగుతారు కానీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌ను విమ‌ర్శిస్తే ఏం లాభం అని మ‌రికొంద‌రి వాద‌న. చూద్దాం ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

1 Comment

  1. maji cm kadu kada power lo vunna cm kuda y.s jagan garini emi cheyaleyadu

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.