2014 ఎన్నికల్లోనే మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడానికి సుముఖత చూపారు అని, ఇటీవల ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది... అయితే అది ఆ మీడియాకి, ఆయన ఏ పార్టీలో చేరతారో వారికి మాత్రమే తెలిసిన విషయం... కాని ఆయన ఇటీవల తన కర్తవ్య బాధ్యతలకు ప్రభుత్వం ఉద్యోగానికి రాజీనామా చేసి వీఆర్ ఎస్ తీసుకోవడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఓ వార్త వైరల్ అవుతోంది.
ఆయన ఇటీవల జనసేన పార్టీలోకి చేరుతారు అని వార్తలు వినిపించాయి... అయితే ఓ మీడియా కథనం ప్రకారం ఆయన తెలుగుదేశంలో చేరి దేశానికి సేవ చేయడానికి సిద్దం అవుతున్నారు అని వార్తలు వినిపించాయి... రాజకీయంగా ఆయన ఎటువంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు.. రాజకీయంగా ఆయన పాలిటిక్స్ అనే సరికి ఇప్పుడు అంతా గతం గురించి ఆలోచిస్తున్నారు..
నాడు విచారణ సంస్దలు కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలు అయ్యాయి అని, జగన్ కేసులు గురించి కూడా ఇలా కాంగ్రెస్ ఆదేశిస్తే ఇలా ఆయన పై చర్యలు తీసుకున్నారు అని.. జగన్ కేసుల విషయంలో అనేక విమర్శలు వచ్చాయి.
మాజీ జేడీ ఆయన పొలిటికల్ ఎంట్రీ పై ఆయన మాట్లాడారు... తన వీఆర్ ఎస్ పై ఓ నిర్ణయం వచ్చిన తర్వాత తాను తన భవిష్యత్ ప్రణాళిక తెలియచేస్తాను అని వెల్లడించారు..అయితే జగన్ కేసుల గురించి ఆయన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు తాను ఆ కేసులు చూడటం లేదు, ఆ కేసులు డీల్ చేస్తున్న అధికారులను అడగండి అని ఆయన తెలియచేశారు.
మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇటువంటి కామెంట్లు చేయడం ఎందుకు అని ఆయన తప్పించుకున్నారు అని అంటున్నారు.. మరి చూడాలి ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి పొలిటికల్ కామెంట్లు వినిపిస్తాయో?
Comments