వైయ‌స్ జ‌గ‌న్ పై ఏరాసు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 07:10:54

వైయ‌స్ జ‌గ‌న్ పై ఏరాసు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కేవ‌లం ముఖ్య‌మంత్రి కావాల‌నే ఆరాటంలో ఉన్నార‌ని, ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌గ‌ల‌మా... లేదా..... అనే విష‌యాల‌ను జ‌గ‌న్ ఆలోచించ‌డం లేద‌ని ప్ర‌తాప్ రెడ్డి ఎద్దేవా చేశారు.
 
త‌న తండ్రి ఒక అడుగు వేశారు....నేను రెండ‌డుగులు ముందుకు వేస్తున్నాన‌ని చెబుతున్న జ‌గ‌న్ .....ఈ అడుగులేదో 2014 ఎన్నిక‌ల్లో వేయాల్సింది...నేను కూడా రుణ‌మాఫీ చేస్తా...ఉచిత క‌రెంట్ ఇస్తా....రూ. 20 వేలు ఇస్తా అని అని చెప్పాల్సింది క‌దా.......ఎందుకంటే వాటిని అమ‌లు చేయ‌డం సాధ్యం కాదు కావునే జ‌గ‌న్ అప్పుడు హామీలు ఇవ్వ‌కుండా.... ఇప్పుడు ముఖ్య‌మంత్రి కావాల‌నే ఆశ‌తో అమ‌లు సాధ్యం కాని హామీలు ఇస్తున్నార‌ని ప్ర‌తాప్ రెడ్డి అన్నారు. 
 
తాను కూడా మొన్న మీటింగ్ లో చెప్పా.....న‌న్ను ముఖ్య‌మంత్రిని చేస్తే, రోజూ మీ ఇంటికి క్యారెర్ పంపిస్తా...బిర్యాని ఇస్తా.....మ‌ట‌న్ పంపిస్తా....వీలైతే క్వాట‌ర్  సీసా కూడా పంపిస్తా.....అంటూ ఏరాసు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆచర‌ణ సాధ్య‌మ‌య్యే వాటినే చెప్తార‌ని ప్ర‌తాప్ రెడ్డి అన్నారు.

షేర్ :

Comments

2 Comment

  1. Anni chesada sir .jobs kuda vachiyi sir nirdyogulaku..thanks sir tdp ki.

    Prathap reddy me cm cheppinavani anni chesada neeku sigguvunda matladataniki neevu atmakur lo vodipote ysr valla 2004 2009 lo gelichavu mari 2014 lo yendu vodi poyavu cheepu

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.