వైసీపీలోకి మాజీ మంత్రి ముహూర్తం ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 15:41:38

వైసీపీలోకి మాజీ మంత్రి ముహూర్తం ఫిక్స్

ప్రతిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జలు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్ని చూసి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌చ్చ‌తంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని భావించి అధికార తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని పాదాయాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.
 
మొత్తం మీద పోలిస్తే రాయ‌ల‌సీమ‌ కంటే కోస్తాంధ్రాలో అధిక స‌ఖ్యంలో వైసీపీలో చేరేందుకు సీనియ‌ర్ టీడీపీ నాయ‌కులు క్యూ క‌డుత‌న్నారు. అయితే ఇప్ప‌టికే  రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి, అలాగే అవంతి కృష్ణప్రసాద్ ఫ్యామిలీ కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఇదే క్ర‌మంలో ఆనం ఫ్యామిలీ, ఆదాల లాంటి సీనియ‌ర్ మాజీ మంత్రులు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి కూడా టీడీపీకి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు కూడా వైసీపీ వైపు చూస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక తాజాగా కొండ్రుముర‌ళీ అంశం కూడా తెర‌పైకి వ‌చ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయ‌న  వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో వైఎస్సార్ జ‌యంతి రోజున త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. కొండ్రుముర‌ళీ వైసీపీలో చేరేందుకు ఇప్ప‌టికే బొత్స స‌త్య‌నారాయ‌ణ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ముర‌ళీ గ‌తంలో రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగి జిల్లాలో మంచి క్యాడ‌ర్ ను సంపాదించుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.