వైసీపీలో చేరిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 14:07:24

వైసీపీలో చేరిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్

కృష్ణా జిల్లాలో అధికార తెలుగుదేశం స‌ర్కారుకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి.. ఇప్ప‌టికే జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో ఎంట్ర‌న్స్ అయ్యే స‌మ‌యంలో యల‌మంచిలి ర‌వి తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.గ‌త నెల 14 వ తేదిన ఆయ‌న వైసీపీలో చేర‌డంతో తెలుగుదేశం కాస్త గ్రాఫ్ ఇక్క‌డ ప‌డిపోయింది అనే చెప్పాలి.
 
ఈరోజు  మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు టీడీపీ నాయకుడు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త వసంత కృష్ణ ప్రసాద్‌, వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని పెరికెగూడెం వద్ద కృష్ణప్రసాద్‌ కలిసి అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. కృష్ణ ప్రసాద్‌మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. ఆయనతో పాటు వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.
 
వైసీపీ పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెరిగింది అని, ప్ర‌జ‌లు వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు అని ఆయ‌న తెలియ‌చేశారు.వైయ‌స్ ఆర్ అభివృద్ది పై, అలాగే సంక్షేమ‌ప‌థ‌కాల పై చెర‌గ‌ని ముద్ర వేశార‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న బాట‌లో త‌న‌యుడు జ‌గ‌న్ న‌డుస్తున్నారు అని ఆయ‌న తెలియ‌చేశారు. జిల్లాలో అన్ని సెగ్మెంట్ల‌లో వైసీపీ గెలుస్తుందని ఆయ‌న అన్నారు.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖండ మెజార్టీతో వైయ‌స్ జ‌గ‌న్ గెలుస్తారు అని అన్నారు. పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది అన్నారు వసంత నాగేశ్వరరావు. త‌న కుమారుడు జగ‌న్ పార్టీలో చేర‌డం శుభ‌ప‌రిణామం అని ఆయ‌న అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డితో మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారాయ‌న‌. ప్రజల కోసం వైయస్‌ఆర్‌సీపీ కృషి చేస్తోందన్నారు. మహానేత పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. జగన్‌ ద్వారా వైయస్‌ఆర్‌ పాలన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయ‌న‌. ఇక ఆయ‌న విజ‌య‌వాడ పార్ల‌మెంట్ లేదా మైల‌వ‌రం నుంచి పోట చేసే అవ‌కాశం ఉంది అని అంటున్నారు జిల్లా వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.