బాబుకు షాక్... వైసీపీలోకి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 18:31:22

బాబుకు షాక్... వైసీపీలోకి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో  టీడీపీ నాయ‌కులు ప్ర‌స్తుతం టెన్ష‌న్ టెన్ష‌న్ గా ఉన్నారు. త‌మ‌కు టీడీపీ త‌ర‌పున వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధిష్ఠానం టికెట్ కేటాయిస్తుందో లేదో అన్న డైలమాలో ప‌డ్డారు టీడీపీ నాయ‌కులు. ఈ క్ర‌మంలో పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోరిక మేర‌కు సెగ్మెంట్ ల వారిగా టీడీపీ నాయ‌కులు ఇంచార్జ్ లు మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు.ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన ప్ర‌తీ చోట తామంటే తాము గ్రేట్ అంటూ స్పీచ్ లు ఇస్తూ ఇత‌ర టీడీపీ నాయ‌కులను కించ‌ప‌రిచేలా మాట్లుడుతున్నారు. దీంతో సెగ్మెంట్ వారిగా వ‌ర్గ విభేదాలు త‌లెత్తుతున్నాయి.
 
ఇక ఇప్ప‌టికే మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ప‌త్తికొండ‌, ఆలూరు, నంద్యాల‌ నియోజ‌కవ‌ర్గాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్గ విభేదాలు త‌లెత్తాయి. ఒక‌రేమో.. ఏయ్ ఎవ‌రితో ఎలా మాట్లాడ‌లో నేర్చుకో లేక‌పోతే భూ స్థాపితం చేస్తానంటూ మిమ‌ర్శ‌లు చేయ‌గా, మ‌రోక‌రేమో ఆలూరులో టీడీపీ రెండో కార్యాలయం ప్రారంభించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇక నంద్యాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే శోభా, భూమా మ‌ర‌ణం త‌ర్వాత అఖిల ప్రియ‌కు టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డికి మ‌ధ్య గొడవ‌లు రోజుకొక మ‌లుపు తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా టీడీపీ కోట బ‌న‌గాన‌ప‌ల్లిలో కూడా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి బీట‌లు వాలే ఛాన్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి త‌న ప్ర‌త్య‌ర్థిపై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. అయితే అధికారంలో ఉన్నాకూడా ఇంత వ‌ర‌కూ ఇక్క‌డ మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌లేదు.దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం తాజాగా వార్త‌ల్లోకి ఎక్కడంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి చేరింది. ఇక‌ చంద్ర‌బాబు, బీసీపై ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలుస్తోంది.
 
బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం అసలు కార‌ణం ఇదే అంటున్నారు విశ్లేష‌కులు.. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన బీసీకి మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డి పూర్తి మ‌ద్ద‌తును అందించారు. ఆయ‌న మ‌ద్ద‌తుతో కేవ‌లం ఒక్క అవుకు మండ‌లంలోనే టీడీపీకి ఏకంగా 5 వేల వ‌ర‌కు మెజార్టీ వ‌చ్చింది. దీంతో బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి అత్య‌ధిక మోజారిటీతో గెలుపొందారు. చ‌ల్లా త్యాగాన్ని గుర్తించిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.
 
కానీ ఇంత వ‌ర‌కూ ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌విని కేటాయించలేదు. దీంతో బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఇదే విష‌యంపై ప్ర‌స్తావించార‌ట‌. చల్లా రామక్రిష్ణారెడ్డికి క‌నీసం స్థానిక ఎమ్యెల్సీ ప‌ద‌వి అయినా కేటాయించాల‌ని కోరారు. అయితే దీనిని కూడా తోసిపుచ్చారు చంద్ర‌బాబు. ఇక చివ‌రికి చేసేది ఏమిలేక ఇటీవల నియమించిన నామినేటెడ్‌ పదవుల్లో చల్లాకు ఆర్టీసీ కడప రీజియన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.
 
సీనియర్‌ నాయకుడినైన తనకు రీజనల్‌ పదవి ఇస్తారా..? అంటూ ఆ పదవిని చల్లా తిరస్కరించి చంద్ర‌బాబు పై  కొద్ది కాలంగా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి వర్గాలు ఏకమయ్యాయి. ఇక చల్లాను కూడా వైసీపీలోకి లాగేందుకు కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకులు  ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
అలాగే  గ‌త ఎన్నిక‌ల్లో  బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి అత్యధిక మెజారిటీ తెచ్చుక‌న్నా కానీ చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న టీడీపీకి గుడ్ బై చెప్పి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందు సిద్దంగా ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలిపారు.అందుకోస‌మే మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని  అంటున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. మొత్తానికి బ‌న‌గానప‌ల్లిలో టీడీపీ ఎటువైపు ప‌య‌నిస్తుందో అన్న టెన్ష‌న్ మొద‌లైంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.