బాబు కి దెబ్బ మీద దెబ్బ.. వైసీపీ లోకి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp and babu
Updated:  2018-11-05 03:57:44

బాబు కి దెబ్బ మీద దెబ్బ.. వైసీపీ లోకి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే..

ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అయిన సంగతి తెల్సిందే. కేంద్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ తో పొత్తు కూడగ కొంతమంది టీడీపీ నేతలు అలిగి వైసిపి లోకి వెళ్లారు. మరి వారెవరు.. వారి వైసిపిలోకి రావడానికి కారణమేంటి..
 
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్ పార్టీల మైత్రీ ఇరు పార్టీలలో పెద్ద రచ్చ లేపుతుంది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ మహనగరంలో గాంధీ భవన్‌ సాక్షిగా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి.అందులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ అనుచరులు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భిక్షపతి అనుచరుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ పార్టీకి షాకిచ్చారు.
 
అందులో భాగంగా సీనియర్ నేత మన్నవ సుబ్బారావు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, వీవీవీ చౌదరి తదితరులు విచ్చేసి పాల్గొన్నారు. మన్నవకు పశ్చిమ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని సభలో ప్రతిపాదన చేయడం అక్కడున్నవారికి అశ్చర్యం కలిగించింది. అయితే మన్నవకు బాబు టికెట్ కన్ఫామ్ చేశారని అందుకే ఈ సభకు మోదుగుల రాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటి నుండో టీడీపీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న మోదుగుల టీడీపీ,కాంగ్రెస్ పొత్తును షాకుగా చూపించి పార్టీ మారతారని.. అందుకే ఈ రోజు జరిగిన కార్యక్రమానికి హజరు కాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మోదుగుల ఎప్పటి నుండో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన సి. రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్వార్థ రాజకీయాలకోసం చంద్రబాబు వచ్చి అడిగితే మీరు ఎలా టీడీపీతో కలిసిపోతారు.
 
ఇన్నాళ్ళు ఎవరితో అయితే కొట్లాడామో వాళ్ళతోనే కలిసి నడవమని చెబితే ఎలా ..కార్యకర్తల మనోభిష్టం మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారక లేఖ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి,జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపించారు.. అయితే త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ఆయన అనుచవర్గం ఈ సందర్భంగా ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు అని వార్తలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాల్ చల్ చేస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment