టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-08-24 12:11:06

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాల‌ను విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ రాను రాను ఏపీలో ఆ పార్టీ ప్ర‌భావం త‌గ్గిపోవ‌డంతో గతంలో రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014 లో సైలెంట్ అయ్యారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో త‌మ పాత రాజ‌కీయాల‌ను ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కులకు రుచి చూపించాల‌నే ఉద్దేశ్యంతో ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. 
 
అయితే ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ మెయిన్ క్యాండెట్స్ అంద‌రు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఇక అక్క‌డ‌క్కడ ఉన్న నాయ‌కులు అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇక ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన క‌నిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి కూడా టీడీపీ తీర్థం తీసుకోనున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్ల‌ను కూడా సిద్దం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 
 
అంతేకాదు ఆయ‌న అమ‌రావ‌తిలో చంద్ర‌బాబును కూడా క‌లుసుకున్నారు. వీరిద్ద‌రి స‌మావేశంలో ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి టీడీపీలో చేరాలని చంద్ర‌బాబు కూడా కోరిన‌ట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాత్రం ఆయ‌న పార్టీ మారితే త‌మ‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తే కేవ‌లం 2వేల 6వంద‌ల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని ఆయ‌న పార్టీ మార‌డం వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌ద‌ని ప్ర‌కాశం జిల్లా వాసులు అంటున్నారు.