150మంది కార్య‌క‌ర్త‌ల‌తో మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-08-20 12:13:07

150మంది కార్య‌క‌ర్త‌ల‌తో మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు విప‌రీతంగా చేరుతున్నాయి. అధికార నాయ‌కులు చేస్తున్న అవినీతిని ఓర్చుకోలేక చాలామంది జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్దం తీసుకుంటున్నారు. అయితే ఇప్ప‌టికే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో రాయ‌ల‌సీమ నుంచి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కీలక‌ నాయ‌కులుగా ఉన్న టీడీపీ నాయ‌కులు, అలాగే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాకు చెందిన ప‌లువురు టీడీపీ నేత‌లు వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌ను  ఉభ‌య‌గోదావ‌రి జిల్లాను పూర్తి చేసుకుని కొద్దిరోజుల క్రితం విశాఖ‌లో అడుగు పెట్ట‌గానే అక్క‌డ కూడా విప‌రీతంగా వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్ర‌రావు త‌న 150మంది అనుచ‌రుల‌తో సుమారు 30 సుమోల‌తో వ‌చ్చి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. అంతేకాదు న‌ర్సీప‌ట్నం మండ‌లం జ‌డ్పీటీసీ మాజీ స‌భ్యుడు బ‌ల‌రామ్మూర్తి కూడా  వైసీపీ తీర్థం తీసుకున్నారు. 
 
పార్టీ  తీర్థం తీసుకున్న త‌ర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి చేసేందుకు త‌మ‌వంతు కృషి చేస్తామ‌ని వారు హ