వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and kanna babu
Updated:  2018-05-05 06:56:17

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు

విశాఖజిల్లా య‌ల‌మంచిలి మాజీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు వైసీపీలో చేరారు.. ఆయ‌నతో పాటు ఆయ‌న కుమారుడు విశాఖ డీసీసీబీ చైర్మన్‌ సుకుమార్‌ వర్మ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జ‌గ‌న్ ను క‌లిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు... పార్టీలోకి వారిని జ‌గ‌న్ సాధ‌రంగా ఆహ్వానించారు.
 
ఆయన వెంట జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డీఎస్‌ఎన్‌ రాజు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ రాజు, మండలి ప్రధాన కార్యదర్శి శంకర్‌ రావులతో పాటు వెయ్యి మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. 
 
ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. అందుకోసం తాను సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు.తెలుగుదేశం చివ‌రి వర‌కూ వారిని వైసీపీలో చేర‌కుండా టీడీపీని వీడ‌కుండా మంత‌నాలు జరిపారు. అయినా ఆయ‌న పార్టీలో ఇమ‌డ‌లేక వైసీపీలో చేరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.