వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 16:14:22

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర, రోజులు పెరిగేకొద్దీ ప్రజల్లో జగన్ పై ఆదరణ కూడా పెరుగుతుంది. జగన్ నాలుగేళ్ళ నుండి ఒకే మాటపైన నిలబడటం, పార్టీ పెట్టినప్పటి నుండి నిత్యం ప్రజల్లో ఉండటంతో ప్రజల్లో జగన్ పైన నమ్మకం పెరిగింది.
 
మరో వైపు తప్పుడు హామీలతో అధికారాన్ని సంపాదించి, నాలుగేళ్లు గడిచిన ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజల్లో టీడీపీ పైన త్రీవ వ్యతిరేఖత ఉంది. చంద్రబాబు నాలుగేళ్ళ నుండి రోజుకో మాట మార్చి ప్రజలను మభ్యపెట్టారు.. ఇది గమనించిన ప్రజలు క్రమక్రమంగా టీడీపీని దూరం పెడుతున్నారు..రోజు రోజుకు చంద్రబాబుపైన నమ్మకం సన్నగిల్లుతుంది...
 
అందుకే జగన్ చేస్తున్న పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తున్న నాయకులు, తమ ఫ్యూచర్ రాజకీయాల కోసం ప్రజల నుండి మద్దతు లభిస్తున్న వైసీపీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు.అందుకే గత రెండు నెలల నుండి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి...
 
రెండు మూడు రోజులకోసారి ఏదో ఒక పార్టీ నుండి కీలక నేతలు పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. జగన్ పశ్చిమ గోదావరిలో అడుగుపెట్టినప్పటి నుండి ఎవరో ఒకరు పార్టీలో జాయిన్ అవుతున్నారు..మొన్న రాలయసీమ మాజీ ఐజి షేక్ మొహమ్మద్ ఇక్బాల్ జాయిన్ అవ్వగా... నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జంగారెడ్డిగూడెంకు చెందిన ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ పీపీఎన్‌ చంద్రరావు జాయిన్ అయ్యారు. ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు...ఈ వలసలతో రోజురోజుకి వైసీపీ లో జోష్ పెరుగుతుంటే, టీడీపీ డీలా పడిపోతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.