బాబుకు షాక్ కాపు డైరెక్ట‌ర్ టీడీపీకి గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-19 11:59:32

బాబుకు షాక్ కాపు డైరెక్ట‌ర్ టీడీపీకి గుడ్ బై

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కులు ముంద‌స్తు రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అధికారంలో ఉండి ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స‌లు పెరుగుతుండ‌టంతో ప్ర‌స్తుతం అధిష్టానానికి అంతుచిక్క‌కుంద‌ట‌. 
 
అంతేకాదు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం భ‌యాందోళ‌న‌ చెందుతున్నారు. అయితే ఇప్ప‌టికే పార్టీకి చెందిన కీల‌క నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి, అలాగే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగ‌నాధ‌రాజులు సైకిల్ ను వీడి ఫ్యాన్ పంచ‌న చేరిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఇదే క్ర‌మంలో తాడేప‌ల్లిగూడెంలో మ‌రో మాజీ మంత్రి త‌న‌యుడు య‌ర్రా నవీన్ కూడా టీడీపీకి షాక్ ఇచ్చారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కాపు సామాజికి కార్పోరేషన్ డైరెక్ట‌ర్ గా ఉన్న ఆయ‌న త్వ‌ర‌లో టీడీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో మొద‌టి సారిగా ఎన్నిక‌లు జరిగితే ఆ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావ‌డానికి ఈ జిల్లానే కీల‌క బాధ్య‌త వ‌హించింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే అన్నిసీట్లు టీడీపీనే కైవ‌సం చేసుకుంది గ‌త ఎన్నిక‌ల్లో.
 
ప‌శ్చిమ‌లో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఎక్కువ అందుకే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని కీల‌క హామీ ఇచ్చి కాపు ఓట్ల‌న్ని టీడీపీకి వేయించుకున్నారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబు దాని ఊసే ఎత్త‌లేదు. దీంతో ఆగ్ర‌హంచిన కాపులు ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిన బుద్ది చెప్పేందుకు సిద్ద‌య్యారు. ఇక వారి వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించి ఎర్రా న‌వీన్ కూడా టీడీపీకి గుడ్ బై చెబుతాన‌ని ప్ర‌క‌టించారు. 
 
ఇక ఆయ‌న పార్టీకి దూరం అయిన ప‌క్షం నుంచి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీకి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. అయితే న‌వీన్ ఏ పార్టీ లో చేరుతార‌నేది మాత్రం చెప్ప‌లేదు. కానీ విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరుతార‌ని తెలుస్తోంది. చూద్దాం న‌వీన్ ను జ‌న‌సేన‌లో ఏ మేర‌కు రానిస్తారో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.