జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-14 18:28:26

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్ర‌ధాన‌ ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌ యాత్ర‌లో భాగంగా ఇత‌ర పార్టీల‌కు చెందిన రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కీలక అనుచ‌రుడు తోపాటు కోస్తా జిల్లాల‌కు చెందిన కొంద‌రు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
ఇక ఇదే క్ర‌మంలో తూర్పు గోదావ‌రి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కీల‌క నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ దృష్టిలో ఉంచుకుని కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఈ రోజు వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ ఆయ‌న‌ను స‌గ‌ర్వంగా పార్టీలోకి ఆహ్వానించి రామారెడ్డికి పార్టీ కండువా క‌ప్పి పార్టీ లోకి ఆహ్వానించారు జ‌గ‌న్.
 
ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి చేసేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని రామారెడ్డి స్ప‌ష్టం చేశారు. అంతేకాదు గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప‌రిపాల‌న సాగించాలంటే అది కేవ‌లం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని ఆయ‌న అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.