వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ex m;a yalamanchili ravi ycp
Updated:  2018-04-10 03:10:08

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు  ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి టీడీపీ నాయ‌కులు ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకొని  వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నారు... గ‌త నాలుగు సంవ‌త్స‌రాల నుంచి చంద్ర‌బాబు  సైకిల్  పై  ప్ర‌యాణించి... గాలి లేని సైకిల్ తొక్కి తొక్కి అల‌సిపోయాము దేవుడా! అన్న కోణంలో ఆలోచిస్తున్నార‌ట అధికార తెలుగుదేశం నాయ‌కులు... తాము జీవితాంతం సైకిల్లో ప్ర‌యాణించినా కూడా త‌మ‌కు ముఖ్య‌మంత్రి ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌ర‌ని భావించి ప్ర‌తీ ఒక్క‌రు ఫ్యాన్ కింద‌ చేరుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు.
 
అయితే ఇప్ప‌టికే  క‌ర్నూల్ జిల్లా బ‌న‌గాన‌పల్లె కు  చెందిన టీడీపీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి  సైకిల్ వ‌దిలి ఫ్యాన్ ప‌ట్ట‌నున్నార‌నే వార్త సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.. తాను 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసినా గెలిచే చాన్స్ లేకుండ‌డంతో బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి వైసీపీలోకి చేరే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయ‌ని అత‌ని స‌న్నిహితులు తెలిపారు.
 
ఇక తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన‌ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా  ఇదే బాట ప‌ట్టారు...ఈయ‌న వైసీపీలోకి చేరేందుకు స‌ర్వం సిద్దం చేసుకుని ఈ నెల 16వ తేదీన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
 
అయితే యలమంచిలిని వైసీపీలోకి చేర‌నీయ‌కుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసి పార్టీ మార‌వ‌ద్ద‌ని సూచించారు... అప్పుడు వారి కోరిక‌  మేర‌కు యలమంచిలి తాత్కాలికంగా పార్టీ మార‌న‌ని ఒప్పుకున్నా, చివ‌ర‌కూ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం పుచ్చ‌కునేందుకు రెడీ అయ్యారు.. 
 
తాను కార్యకర్తల కోరిక మేరకు వైసీపీలో చేరుతున్నాన‌ని ర‌వి తెలిపారు.. తాను వైసీపీలో చేరుతున్నందుకు జ‌గ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌ని స్ప‌ష్టం చేశారు యలమంచిలి. కొడాలి నాని, వంగ‌వీటి రాధా, ర‌వి పార్టీలో చేర‌డానికి మంత‌నాలు జ‌రిపారు.. గుంటూరులో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ను క‌లిసిన ర‌వి త‌న కోరిక‌ను తెలియ‌చేశారు... పార్టీలో స‌ముచిత స్ధానం ఉంటుంది అని ర‌వికి జ‌గ‌న్ మాట ఇచ్చారు... దీంతో ఆయ‌న పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకున్నారు..
 
 
గ‌తంలో ఆయ‌న దేవినేని నెహ్రూని ఓడించిన స‌మ‌యంలో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున కృష్ణా జిల్లా అంతా ఆయ‌న పొలిటిక‌ల్ స్టార్ అయ్యారు... గ‌త ఎన్నిక‌ల్లో బాబు ఆయ‌న‌కు సీటు ఇస్తాను అని ఇవ్వ‌లేదు, ఇప్పుడు పార్టీ ప‌రిస్దితి ఆలోచించి త‌న‌కు స‌ముచిత స్ధానం లేని చోట ఎందుకు ఇమ‌డం అని ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. మొత్తానికి వైసీపీకి విజ‌య‌వాడ మూడు సెగ్మెంట్ల‌లో అభ్య‌ర్దులు రెడీ అయ్యారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.