వైసీపీలోకి క్యూ కడుతున్న నేతలు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 17:01:23

వైసీపీలోకి క్యూ కడుతున్న నేతలు...

వైసీపీ బలం పెరిగిందా? ఎన్నిక‌ల వేళ పార్టీ అధినేత ఆశ‌యాల‌కు అనుగుణంగా పార్టీ పుంజుకుంటోందా? ఈ సంవత్సరం కాలంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలతోనే బలం పెరిగిందా? బాబు రెండు నాల్కుల ధోరణితో బలం పెరిగిందా? టీడీపీ ఇచ్చిన తప్పుడు హామీలను, చేసిన అవినీతిని ప్రజలు గమనించారా? ఒకప్పుడు జగన్ ని విమర్శించిన నాయకులే జై జగన్ అనేందుకు సిద్దమవుతున్నారా? పార్టీలోకి వలసల తాకిడి పెరిగిందా? అంటే అవుననే సమాధానం వస్తుంది... ఈ నాలుగేళ్ళ కాలంలో చంద్రబాబు చేసిన అవినీతి, ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో టీడీపీ పైన, చంద్రబాబు పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది.
 
ప్రత్యేక హోదా విషంయంలోనూ రోజుకో మాట మాట్లాడటం, యూ - టర్న్ లు తీసుకోవడవంతో ప్రజలే చంద్రబాబు పై విమర్శల దాడి చేస్తున్నారు...ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తాంఅన్నారు...కొన్ని గంటల సమయంలోనే మేమే  అవిశ్వాస తీర్మానం పెడతాం అని చెప్పడంతో ప్రజలు నీరసించిపోయారు...  ఇక్కడేమో బీజేపీ నుంచి బయటకి వచ్చాము అని చెప్తారు, ఢిల్లీకి వెళ్తే బీజేపీతో కలిసే ఉన్నాం అంటారు చంద్రబాబు... దీని పైన సోషల్ మీడియాలో " తెలుగులో అయితే విడాకులు తీసుకున్నాం, అదే ఇంగ్లీష్ లో అయితే కలిసే ఉన్నాం"  అంటూ జోకులు పేలుతున్నాయి...ఈ మాటలతో టీడీపీ పైన ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది...
 
ఇవన్నీ బేరీజు వేసుకుంటున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టం అని భావించి వేరే పార్టీల వైపుకు మొగ్గు చూపుతున్నారు...ఇక ఏపీలో మిగిలింది వైసీపీ, జనసేన, బీజేపీ,కాంగ్రెస్...ఇక బీజేపీ విషయానికి వస్తే అక్కడక్కడా తన హవా ఉన్నా ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంతో అటు వైపు మొగ్గు చూపడానికి ఇష్టపడటం లేదు...మిగిలిన కాంగ్రెస్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది...కాంగ్రెస్ కి ఎక్కడ డిపాజిట్ లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో దానిని గాలికి వదిలేసారు...జనసేన అయితే అన్ని చోట్ల పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు...కేవలం 30 నుండి 40 సీట్లు పోటీ చేయవచ్చు.... దింతో అధికారంలోకి వచ్చే సమస్యే లేదు, అందువలన కేవలం కొంత మంది మాత్రమే అటువైపు మొగ్గు చూపుతున్నారు...
 
2014 లో చంద్రబాబు ఇస్తుంది తప్పుడు హామీలు అని జగన్ చెప్పిన మాటలు ప్రజలకు ఇప్పుడు గుర్తు రావడం, జగన్ ప్రత్యేక హోదా విషయంలో ఒకే మాట పైన ఉండటంతో వైసీపీకి మంచి మైలేజీ వచ్చింది...ఈ పరిణామంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో నాయకుల దృష్టీ వైసీపీపై ప‌డింది. దీంతో అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు. 
 
అందులో భాగంగానే తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ అమలాపురం లోని సుమారు నాలుగు మండలాల నుంచి 250 కార్లలో గుంటూరుకి వచ్చి ఉండవల్లిలో పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిశారు.. ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా వ‌చ్చి ఆయనతోపాటు పార్టీలో చేరి కండువా క‌ప్పుకొన్నారు.
 
ఇంకా కమ్మ సామజిక వర్గానికి చెందిన విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు...చంద్రబాబు, యనమల, నారాయణ బుజ్జగించే ప్రయత్నం చేసిన టీడీపీ నుండి బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు...జగన్ పాదయాత్ర గుంటూరులోకి ప్రవేశించగానే త‌న అనుచరులతో క‌లిసి వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ మాజీ నేత కొండ్రు ముర‌ళి కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అంటున్నారని విశ్వసనీయ సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.