వైసీపీలోకి మాజీ ఎంపీ...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ex mp kanumuri bapiraju image
Updated:  2018-03-11 12:55:42

వైసీపీలోకి మాజీ ఎంపీ...

ఆంధ్రాలో ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు కీలక పాత్రా పోషిస్తాయి...గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ వైపు గాలి వీస్తుందో ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి...ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ రాజకీయమంతా ఉభయ గోదావరి జిల్లాల్లోనే తిరుగుతూ ఉంటుంది...అందుకే అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికలో త్రీవ కసరత్తులు చేసి ధనం, వర్గం, బలాన్ని బేరీజు వేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు...
 
అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు ఆ పార్టీలో రాజకీయంగా పుల్ స్టాప్ పడింది...ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నాయకులు క్రియాశీలక‌ రాజకీయాలకు దూరంగా ఉంటే, మరికొందరు టీడీపీ, వైసీపీలో కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే... తన బలాన్ని మరింత పెంచుకోవడానికి టీడీపీ - వైసీపీల చూపు కాంగ్రెస్ నాయకులపై పడిన‌ట్లు తెలుస్తోంది... అందుకే ఇరు పార్టీల నాయ‌కులు వేట మొదలుపెట్టారు...అయితే కొందరు నాయ‌కులు వారి రాజకీయ భవితవ్యం కోసం వాళ్లకు నచ్చిన పార్టీల వైపు మొగ్గుచూపుతుంటే...సైలెంట్ గా ఉన్న నేతలపై పార్టీలు వేట మొదలుపెట్టాయి...
 
కాంగ్రెస్ పార్టీలో సౌమ్యుడిగా, ప్రజలకు అందుబాటులో వుంటూ పశ్చిమ గోదావారి జిల్లాలో చక్రం తిప్పిన నేతగా పేరొందిన నేత కనుమూరి బాపిరాజు...ఈయన రాజకీయంగా మరింత ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది...ఇందుకోసం తన అనుచరులతో, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి...కాగా ఇప్పుడున్న రాజ‌కీయ పార్టీల‌ను  పోలిస్తే  ప్రస్తుతం వైసీపీలో రాజకీయ భవితవ్యం బాగుంటుంది అనుకుంటున్నారట బాపిరాజు...అందుకే అయన వైసీపీలో చేర‌డానికి స‌ర్వం సిద్దం చేసుకున్న‌ట్లు స‌న్నిహితుల‌ సమాచారం...దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయన నరసాపురం ఎంపీ స్థానానికి వైసీపీ త‌రుపున పోటీ చేయడానికి ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నారట.
 
2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.. ఈ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల‌ను టీడీపీ-బీజేపీ కూట‌మి క్లీన్‌స్వీప్ చేసింది...2019 ఎన్నికల్లో టీడీపీని ధీటుగా ఎదుర్కోడానికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలు వ్యూహాలను  అమలుచేస్తున్నారు...అందులో భాగంగానే  కాంగ్రెస్ నాయకులపై వేట మొదలుపెట్టారు జ‌గ‌న్... కనుమూరి బాపిరాజు వైసీపీలోకి వస్తే ఆయనకు నరసాపురం ఎంపీ సీట్ కేటాయించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం...అయన వస్తే వైసీపీకి  పశ్చిమ గోదావ‌రి జిల్లాలో తన బలం పెరుగుతుంది...అందుకే ఆయన వస్తే వైసీపీలో మరింత జోష్ పెరుగుతుందని అనుకుంటున్నారు వైసీపీ నాయకులు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.