వైసీపీలోకి మాజీ ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 18:39:32

వైసీపీలోకి మాజీ ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుకుంటూ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ఇక ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌న‌నేత జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు తెలుపుతున్న‌ మ‌ద్ద‌తుని చూసి 2019 ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు టీడీపీ నాయ‌కులు. అయితే వారు బ‌య‌టికి మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని త‌మ అనుకూల ప‌చ్చ‌మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకున్నా కానీ తెర వెనుక మాత్రం వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు.
 
అందుకే చాలా మంది టీడీపీ నాయ‌కులు గ‌త కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నార‌ట‌. ఇక మ‌రి కొంత మంది టీడీపీ నాయ‌కులు అయితే  పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
అలా తీసుకున్న వారిలో కృష్ణా జిల్లాకు చెందిన‌ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి, అలాగే ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌, తన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు క‌లిసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు కోగ‌టం విజ‌య భాస్క‌ర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక  వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ ఉంగుటూరు నియోజకవర్గాన్ని మ‌రికొద్ది రోజుల్లో పూర్తి చేసుకుని ఈ నెల 28,29 తేదీల్లోపు న‌ర‌సాపురం కు చేరుకుంటారు. న‌ర‌సాపురంకు జ‌గ‌న్ చేరుకున్న త‌ర్వాత భ‌హిరంగ‌స‌భ‌ను నిర్వ‌హించ నున్నారు. ఈ భ‌హిరంగ స‌భ‌లో టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలంద‌రూ క‌లిసి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో మూకుమ్మ‌డిగా వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇక ఇప్ప‌టికే వారి పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి. 
 
ఇక మిగిలిన వారిపేర్లు మ‌రికొన్ని రెండురోజుల్లో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అయితే మ‌రోవైపు న‌ర‌సాపురంకు జ‌గ‌న్ ఎప్పుడెప్పుడు వ‌స్తారా ఆయ‌న స్పీచ్ ఎప్పుడెప్పుడు విందామా అనే ఆత్రుత‌తో ప్ర‌జ‌లు కోటీ ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్నారు.మొత్తానికి జ‌గ‌న్ న‌ర‌సాపురంలోకి అడుగుపెడితే టీడీపీ నాయ‌కులు ఎంత‌మంది వైసీపీలోకి వెళ్లారు అని కౌంటిగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.