చంద్ర‌బాబుకు ఉండ‌వ‌ల్లి సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 17:46:49

చంద్ర‌బాబుకు ఉండ‌వ‌ల్లి సూటి ప్ర‌శ్న‌

రాజ్యాంగ విరుద్ద‌మైన ఆంధ్రాబిల్లు చ‌ర్చ‌కోరుతూ టీడీపీ పార్ట‌మెంట్ స‌భ్య‌ల‌తో నోటీసులు ఇప్పించ‌వ‌ల‌సిందిగా కోరుతూ 11 మే 2018 రోజున తాను ఒక లేఖ రాశాన‌ని మాజీ ఎంపీ రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు.
 
ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్దాలు, మోసాలు చేస్తూ కాలం గ‌డుపుతున్నార‌ని ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను సాధించాల‌నే చిత్త‌శుద్ది టీడీపీ నాయ‌కులకు లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు
 
చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో నాలుగు సంవ‌త్స‌రాలు మిత్ర‌ప‌క్షంగా ఉండి ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో కేంద్రానికి వ్య‌తిరేకంగా దీక్ష‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. టీడీపీ నాయ‌కులు దీక్ష‌లు చేయ‌క‌ముందు పార్ల‌మెంట్ స‌మావేశంలో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై ఎందుకు పోరాటం చేయ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
అలాగే విభ‌జ‌న అంశాల‌పై ప్ర‌ధాని లేవ‌నెత్తిన అంశంపై, చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆయ‌న కోరారు. ఏపీకి జ‌రిగిన అన్యాయం పై స‌భా స‌మావేశంలో రాజకీయ నాయ‌కులు ఎవ్వ‌రు చ‌ర్చించ‌ర‌ని, అయితే వారు చ‌ర్చించ‌కపోతే  రానున్న రోజుల్లో ఏపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారుతుంద‌ని ఉండ‌వ‌ల్లి  స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.