బాబును దుమ్ముదులిపిన ఉండ‌వ‌ల్లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

undavalli and chandrababu naidu
Updated:  2018-09-03 12:50:55

బాబును దుమ్ముదులిపిన ఉండ‌వ‌ల్లి

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బాండ్ల‌పేరుతో ప్ర‌జ‌ల‌ను వంచిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. అయితే వ‌డ్డి రేట్ల‌ పై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈరోజు రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, రాజ‌ధానిలో ట్యాక్స్ విలువ ఎంతో తెలియ‌కుండా బాండ్ల‌ను ఎలా ఇష్యూ చేస్తార‌ని టీడీపీ స‌ర్కార్ ను ప్ర‌శ్నించారు ఆయ‌న‌. దేశంలో ఎక్క‌డాలేని విధంగా ఆంధ్రప్ర‌దేశ్ లో ఎనిమిదిన్న‌ర రూపాయ‌ల‌ను క‌రీదు చేసే చిఫ్ లిక్క‌ర్ మ‌ధ్యం సుమారు 50 రూపాయ‌ల‌కు అమ్ముతున్నార‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. 
 
ఈ మ‌ద్యాన్ని కొనేది సాధార‌ణ వ్య‌క్తులు కాబ‌ట్టి వారి దగ్గ‌ర నుంచి 37 రుపాయ‌ల‌ను ప్ర‌భుత్వం వ‌సూలు చేస్తుంద‌ని ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. ఈ మ‌ధ్య‌కాలంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప‌లువురు నన్ను క‌లుస్తున్నార‌ని, మ‌రికొంద‌రు అయితే వారు చేస్తున్న ఉద్యోగాలను వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌స్తామ‌ని అంటున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రాష్ట్రంలో ప‌రిపాల‌న చేయ‌కుండా వ్యాపారం చేస్తున్నార‌ని ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. పేద, ధ‌నిక వ‌ర్గాల మ‌ధ్యంత‌రాన్ని తొల‌గించాల‌ని వారి ఆర్థిక‌స్థితి గ‌తులను తొల‌గించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
ఇంకా చంద్ర‌బాబును ఉండ‌వల్లి ఏమ‌ని ప్ర‌శ్నించారు అంటే
 
అనేక కండీష‌న్ల మ‌ధ్య రాష్ట్రం ప్ర‌భుత్వ అప్పు చేయాల్సిన ప‌రిస్థితి. 
దేశంలో ఎక్క‌డాలేని విధంగా ఇక్క‌డ  అధిక వ‌డ్డిలు వ‌సులు చేస్తున్నారు. 
రాజ‌శేఖ‌ర్ రెడ్డి దగ్గ‌ర ప‌నిచేసే వారిని జైల్లో పెట్టించామ‌ని అన్నారు. 
జ‌ల‌య‌జ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటి
ఇప్పుడు బాబు హ‌యాంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటి 
రోజు మార్కెట్ లో రాష్ట్రం విలువ‌ త‌గ్గుతోంది. 
టీడీపీ నాయ‌కులు నాలుగేళ్ల‌లో ల‌క్షా 30 వేల కోట్లు అప్పులు చేశారు. 
ఇంత అప్పు తీసుకుని దేనికి ఖ‌ర్చు చేశారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. 
క‌రెప్ష‌న్ చేసి డ‌బ్బులు ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని బాబు చెప్పారు. 
గతంలో నంద్యాల‌లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో బాబు ఇదే మాట ఒప్పుకున్నారు.
చంద్ర‌బాబు నిజాలు చెప్పి పాల‌న చేయ‌గ‌ల‌రా. 
వారానికి చేసే ఖ‌ర్చును బాబు ప్ర‌జ‌ల‌కు చెప్ప‌గ‌ల‌రా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.