టీడీపీ కంచుకోట‌లో బాబుకు దిమ్మ‌తిరిగే షాక్ వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 13:49:08

టీడీపీ కంచుకోట‌లో బాబుకు దిమ్మ‌తిరిగే షాక్ వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు వ‌ర‌కు అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌కవ‌ర్గం టీడీపీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నసంగ‌తి తెలిసిందే.అయితే గ‌తంలో రామారావు పార్టీ స్థాపించిన త‌ర్వాత త‌న సొంత జిల్లా కృష్ణా జిల్లాలో కాకుండా 1985 నుంచి 1994 వ‌ర‌కూ వ‌రుసగా ఆయ‌న హిందూపురంలో టీడీపీ త‌రుపున పోటీ చేసి త‌న ప్ర‌త్యర్థిపై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. 
 
ఆ త‌ర్వాత ఈ నియోజ‌క‌ర్గంలో ఉప ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ  పోటీచేసి గెలిచారు. 1999 వెంక‌ట‌ర‌మ‌ణ‌, 2004లో పీ.రంగ‌నాయ‌కులు, 2009లో అబ్దుల్ ఘ‌ని, 2014 లో ఎన్. బాల‌కృష్ణ ఇలా ప్ర‌తీ సారి హిందూపురం సెగ్మెంట్ లో టీడీపీనే త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ హ‌యాంలో కూడా ఈ నియెజ‌కవ‌ర్గంలో టీడీపీనే ప్రాతినిథ్యం వ‌హించింది. అంత‌టి చ‌రిత్ర ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  వైఎస్ జ‌గ‌న్ ఎంట్రీతో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
 
ఇక దీంతో పాటు మాజీ టీడీపీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘ‌ని కూడా చంద్ర‌బాబుపై అసంతృప్తితో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  గ‌డిచిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అబ్దుల్ ను కాకుండా బాల‌కృష్ణ‌కు సీటు కేటాయించారు. అంతే కాదు పార్టీ అధికారంలోకి వ‌స్తే నామినేటెడ్ ప‌ద‌విని ఇస్తాన‌ని చెప్పి ముఖ్య‌మంత్రి ఇంత‌వ‌ర‌కు ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌విని ఇవ్వ‌లేదు. త‌న ప‌ద‌విని త్యాగం చేసినా కూడా చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌కపోవ‌డంతో ఆయన చాలా కాలంగా పార్టీపై అసంతృప్తి చెంది దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా త‌న‌కు చంద్ర‌బాబు ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌ర‌ని భావింబి అబ్దుల్ పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాదు ఈ విష‌యంపై ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో కూడా చ‌ర్చించార‌ట‌.  అందుకు అనుచ‌రులు కూడా సానుకూలంగా స్పందించ‌డంతో త్వ‌ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్తలు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.