ఆపరేషన్ గరుడ- ద్రవిడ లో నిజమెంత ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:48:33

ఆపరేషన్ గరుడ- ద్రవిడ లో నిజమెంత ?

ఆపరేషన్ గరుడ- ద్రవిడ పేరుతో   BJP దక్షిణాది రాష్ట్రాలపై దాడి చేయబోతున్నట్లు ఆరోపిస్తూ అందుకు ఏకంగా 4800 కోట్ల రూపాయిలను వెచ్చించబోతున్నట్లు సినీ నటుడు శివాజీ  ఆరోపించారు. నిజానికి  BJP ఆపరేషన్ గరుడ- ద్రవిడ పేరుతో ప్లాన్ చేసిందా ?  అన్న అనుమానం నేడు రాష్ట్రంలోని ప్రజల ముందు చర్చనీయాంశం అవుతున్నది. 2014 లో మంచి మెజారిటీతో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ మెజారిటీ వెనుక ఉన్న బలహీనత ఏమి టంటే వారికి వచ్చిన దాదాపు 280  సీట్లలో 202 సీట్లు కేవలం ఉత్తరప్రదేశ్, మధ్య‌ప్రదేశ్, రాజస్దాన్, గుజరాత్, బీహర్, ఢిల్లీ రాష్ట్రాలలోనే. 
 
ఇప్పటికే జరిగిన ఎన్నికల లెక్కలు పరిసీలిస్తే. మధ్య‌ప్రదేశ్, రాజస్దాన్, ఢిల్లీ, బీహర్ ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయింది. నిన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కూడా ఓటమిని చవిచూసింది. ఆలెక్కన 100 పై చిలుకు స్దానాలు తగ్గనున్నాయి. ముందు చూపు కలిగిన పార్టీ ఏదైనా కొత్త రాష్ట్రాలలో  కృషి చేయడం ద్వారా తగ్గిన స్దానాలను భ‌ర్తీ చేసుకుంటాయి.
 
ఆ పనినే  BJP నేడు చేస్తుంది.. ఆ పార్టీకి మిగిలింది దక్షిణాది రాష్ట్రాలు. అలా దక్షిణాది రాష్ట్రాలలో అవకాశం ఉన్నమేరకు స్దానాలను పొందాలని ఆ పార్టీ ప్రయత్నం ఎప్పుడో ప్రారంభించింది. నేడు అధికార తెలుగుదేశం కేంద్రంలో రాజకీయంగా సంబందాలను వదులుకుంది. నేరుగా విడిపోవడానికి  కారణాలను ప్రజలకు చెప్పవలసిన అధికార పార్టీ అందుకు భిన్నంగా కుట్ర కోణాన్ని ప్రజల ముందు ఉంచుతుంది.  BJP దక్షిణాది రాష్ట్రాలలో కొన్ని స్దానాలను నెగ్గడానికి అనుసరించే పద్దతులలో అప్రజాస్వామిక విషయాలు ఉంటే కచ్చితంగా ప్రశ్నించాలి. 
 
కానీ అసంబద్దమైన వాదనలు చేయడం సముచితం కాదు. అందుకు  సినీనటులు పూనుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ప్రధాన మీడియా స్రవంతి కూడా సంచలనాలను చెపుతున్నారన్న పేరుతో హేతుబద్దత లేని విషయాలకు విపరీత ప్రాధాన్యత ఇవ్వడం దరదృష్టం.  ఇలాంటి అర్దంలేని చర్చల వలన ఆంధ్ర‌ప్రదేశ్ ప్రజలకు కావాల్సిన అంశాలు మరుగున పడి సెంటిమెంట్ రాజకీయాలు ముందుకు వచ్చి ఏదో ఒక రాజకీయపార్టీ లాబపడటం మరో పార్టీ నష్టంపోవడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ  నా భావన ప్రజలు ఓడిపోతారు. ప్రజలు  ప్రయోజనాల ప్రాతిపదికన రాజకీయ చర్చలు జరగాలి. అందుకు విజ్ణతకలిగిన వ్యక్తులు ప్రయత్నించాలి. మీడియా అందుకు సహకరించాలి. తిరుపతి సిటీ కేబుల్ సహకారంతో  చిన్న ప్రయత్నం మీ పరిశీలన కోసం.
 
యం. పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి. 9490493436

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.