జ‌గ‌న్ పై విష ప్ర‌చారం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 05:51:11

జ‌గ‌న్ పై విష ప్ర‌చారం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై మ‌రో విష ప్ర‌చారం చేసే బాధ్య‌త‌ను తీసుకున్నారు అధికార పార్టీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగుతోంది. శ‌నివారం నాడు జగన్ పాదయాత్రలో గుండెపోటుతో అనంతపురం జిల్లాకు చెందిన రంగారెడ్డి మ‌ర‌ణించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే రంగారెడ్డిని చూసేందుకు కూడా వైయ‌స్ జ‌గ‌న్ వెళ్ల‌లేదంటూ ప‌చ్చ బ్యాచ్ విష ప్ర‌చారం మొద‌లుపెట్టింది. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా పోష్టింగ్ లు పెడుతున్నారు. వాస్త‌వానికి వైయ‌స్ జ‌గ‌న్ రంగా రెడ్డి మృత‌దేహాన్ని సంద‌ర్శించి నివాళులు అర్పించారు. అంతేకాకుండా రంగా రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని కూడా వైయస్ జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు.

పైన వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ప‌చ్చ బ్యాచ్ చేస్తున్న ప్ర‌చారం అవాస్త‌మ‌ని. ఇలాంటి వారి వ‌ల్ల సోష‌ల్ మీడియాపై చాలా మందికి ఏది నిజ‌మో ఏది అబ‌ద్ద‌మో న‌మ్మ‌లేని ప‌రిస్ధితిలో ప్ర‌జ‌లు ఉన్నారు. ఈ విష‌యంలో మాత్రం అంద‌రికీ వాస్త‌వం తెలియజేయాల్సిన బాధ్య‌త అభిమానుల‌పై ఎంతైనా ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.