మ‌రోసారి వ‌ర్గ‌ విభేదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp leader issues
Updated:  2018-05-16 05:50:05

మ‌రోసారి వ‌ర్గ‌ విభేదాలు

2019 సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది కాలం ఉన్నా, టీడీపీ అధిష్టానం త‌మ‌కు టికెట్ ను కేటాయిస్తుందో లేదో అన్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా విడిపోతున్నారు. అయితే ఈ క్ర‌మంలో సైకిల్ యాత్ర,  మినీ మహానాడు కార్య‌క్ర‌మాల‌ పేరుతో సెగ్మెంట్ ల వారీగా విస్త్ర‌తంగా ప్ర‌చారం చేసుకుంటూ  తామంటే తాము గ్రేట్ అని కాల‌ర్ ఎగ‌రేసుకుంటూ ప్ర‌చారం చేస్తున్నారు టీడీపీ నాయ‌కులు. అయితే ఈ వ‌రుస‌లో క‌ర్నూల్ జిల్లా మొద‌టి స్థానంలో ఉంది.
 
కొద్ది రోజుల  క్రితం చంద్ర‌బాబు నాయుడు కోరిక మేర‌కు టీడీపీ నాయ‌కుడు ఏ.వీ సుబ్బారెడ్డి, అలాగే మంత్రి అఖిల ప్రియ విడివిడిగా ఆళ్ల‌గ‌డ్డ‌లో సైకిల్ యాత్ర‌ను చేప‌ట్టారు. అయితే ఈ యాత్ర‌లో ఏ.వీ సుబ్బారెడ్డి పై అఖిల ప్రియ అనుచ‌రులు రాళ్ల‌తో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో ప‌త్తికొండ టీడీపీ ఇంచార్జ్ శ్యాంబాబు మినీ మహానాడు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ కే ఈ ప్ర‌భాక‌ర్ తో పాటు శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక ఈ హంగామాను చూసిన ప్ర‌భాక‌ర్ తుగ్గ‌లి నాగేంద్ర‌ను చూసి ఏదో ఒక మాట అన్నారు దీంతో వారిద్ద‌రి మ‌ధ్య వ‌ర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి.
 
ఇక తాజాగా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో ఈ రోజు  మినీ మహానాడు స‌భ‌ను ఏర్పాటు చేశారు. అయితే స‌భ ప్రారంభంలోనే ఆలూరు టీడీపీ ఇంచార్జ్‌ వీరభద్రగౌడ్‌, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్‌ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల నేత‌లు నువ్వెంత‌ అంటే నువ్వెంత అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డంతో అక్క‌డ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. దీంతో ఆవేశానికి లోనైన వైకుంఠం వర్గీయులు దాడికి దిగడంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించారు. ఇక వారితో పాటు సభకు హాజరైన టీడీపీ మహిళా కార్యకర్తలు, ప్రజలు ఇంటిదారి పట్టారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.