టాలీవుడ్ చూపు వైసీపీ వైపు ఇదిగో లిస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tollywood
Updated:  2018-06-28 05:49:54

టాలీవుడ్ చూపు వైసీపీ వైపు ఇదిగో లిస్ట్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 సార్వ‌త్రిక ఎన్నికల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇక ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి 2019లో ఖ‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి టీడీపీ నాయ‌కులు, గ‌తంలో కాంగ్రెస్ పార్టీ క్రియ శీల‌కపాత్ర పోషించిన‌ నాయకులు కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
ఇక వీరితో పాటు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు రాజ‌కీయ అరంగేట్రం చేసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ వైపు ఏ ఒక్క‌రు క‌న్నెత్తి కూడా చూడ‌డంలేదు. ఎందుకంటే దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టులే కాకుండా నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు ఇలా చెప్పుకుంటుపోతే ప్ర‌తీ ఒక్క‌రికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంచి జీవితాల‌ను ఇచ్చారు. ఇక ఆయ‌న మీద పెంచుకున్న ప్రేమ‌ను ఇప్పుడు వైసీపీలో చేర్చెలా చేస్తున్నాయ‌ని ఫిలింన‌గ‌ర్ లో వార్త‌లు వ‌స్తున్నాయి.
 
జ‌గ‌న్ త‌మ‌కు వ‌చ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు పార్టీ కోసం తాము ప్ర‌చారం చేసి వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు త‌మ‌వంతు కృష్టి చేస్తామ‌ని ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు ముందుకు వ‌స్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే జ‌గ‌న్ వ‌చ్చేఎన్నిక‌ల్లో సీటు ఇస్తే ఖ‌చ్చితంగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలో పార్టీలో చేరుతారంటూ కొన్ని పేర్లు బ‌య‌టి వ‌చ్చాయి. అందులో మొద‌టిగా డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు వైసీపీ లో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈయ‌న స్వ‌యాన వైఎస్ కుటుంబాని బందువు కావ‌డంతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లోపు ఖ‌చ్చితంగా వైసీపీలో చేరుతారు. ఇదే క్ర‌మంలో హీరో నిఖిల్ కూడా ప‌రోక్షంగా ప్ర‌త్య‌క్షంగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని వైసీపీ బంధంలో చేరాల‌నుకుంటున్నార‌ట‌. 
 
అంతే కాదు నిఖిల్ సొంత‌ బావ తండ్రి అయిన కొండయ్య కూడా వైకాపాలో చేరారు. అలాగే దర్శకుడు వివి వినాయక్  కూడా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. గతంలో వివి కి ఇత‌ర పార్టీ నాయ‌కులు కూడా ఆఫ‌ర్ ఇచ్చారు కానీ ఆయ‌న ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ ఆహ్వానం పంపితే వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

1 Comment

  1. list edabba

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.