జనసేనకు బలం చేకూరే వార్త.. ఆ ఐదుగురు ముఖ్యనేతలు జనసేనలోకి జంప్..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

janasena
Updated:  2018-10-13 01:30:35

జనసేనకు బలం చేకూరే వార్త.. ఆ ఐదుగురు ముఖ్యనేతలు జనసేనలోకి జంప్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది.. ఉదయం 9 గంటల సమయంలో జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కు వేదమంత్రాలతో స్వాగతం పలికారు.. అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించారు..  అనంతరం మనోహర్ తో పాటు ఇతర ముఖ్యనేతలతో పవన్ సమావేశమయ్యారు.. ప్రస్తుతం ఎపి లో జరుగుతున్న ఐటీ దాడులు రాష్ట్ర రాజకీయాలపై చర్చలు జరిపారు.. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షించారు..
 
ఇకపై పార్టీ కార్యకలాపాలు అమరావతి కేంద్రంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా జనసేన శ్రేణులకు దిశానిర్దేసం చేసారు.. అయితే వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేనలోకి ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు జంప్‌ చేస్తున్నారా ? వీరి చేరికకు ముహూర్తం ఖరారు అయ్యిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు టాప్‌ లీడర్లు జనసేనలో చేరనున్నారా ? అంటే జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలో సీట్లు రాని వారందరూ జనసేన గూట్లోకి జంప్‌ చేసేస్తున్నారు. నిన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో వైసీపీ సమన్వయకర్తగా పని చేసిన పితాని బాలకృష్ణకు వైసీపీ టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన జనసే