వైసీపీలో ఐదుగురు ఎమ్మెల్యేలు టార్గెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 15:06:56

వైసీపీలో ఐదుగురు ఎమ్మెల్యేలు టార్గెట్

అధికారం చేతిలో ఉంటే గ‌డ్డిపుల్ల‌ను కూడా అన‌వ‌స‌రంగా అంటుకుంది అని మ‌సి అయిన త‌ర్వాత జైల్లో పెట్టి కేసు పెడ‌తారు.. అధి అధికార అండ‌.. అయితే ఇప్పుడు ప్ర‌తిప‌క్షం పై తెలుగుదేశం టార్గెట్ 101 ప‌ర్సెంట్ ఉంది అని..ఇటు వైసీపీ తెలియ‌చేస్తోంది..వైసీపీలో మంచి వాక్చాతుర్యం క‌లిగిన నాయ‌కులు అలాగే వైసీపీ గొంతును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే నాయ‌కుల‌ను మీడియా ద్వారా అణ‌గ‌దొక్కితే ప్ర‌జ‌ల్లో ప‌ల్స్ త‌గ్గించిన వారం అవుతామ‌ని, ఇటు అధికారపార్టీ ఆలోచించింది..ఆలోచ‌న‌కు అంకురార్ప‌ణ చేసి వారి ఆస్ధాన మీడియాల‌తో వారిపై విష ప్ర‌చారం అయితే మొద‌లు పెట్టింది.
 
ఇటు నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల‌ని ఇద్ద‌రిని టార్గెట్ చేసి, ఒక‌రిపై క్రికెట్ బుకీ కేసు, మ‌రొక‌రిపై క్రికెట్ బుకీల‌కు స‌హ‌క‌రిస్తున్నారు అనేలా ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను టార్గెట్  చేసింది.. ఇటు గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే పై అవినీతి నిరోధ‌క శాఖ ద్వారా త‌న ప్ర‌తాపం చూపుతోంది.. ఇటు తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇసుకాసురుల‌కు వెనుక ఉంది, అధికార పార్టీ టీడీపీ క‌న్వీనర్ అయితే, వైసీపీ నాయ‌కుల‌కు ఆ ఇసుక దందాలో భాగం ఉంది అనేలా ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు రాయిస్తూ నియోజ‌క‌వ‌ర్గాల్లో వారిపై నెగిటీవ్ ప్ర‌చారం మొద‌లు పెట్టిస్తున్నారు.
 
ఇటు చిత్తూరు జిల్లాలో ఓ మ‌హిళా ఎమ్మెల్యే కు జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌ర‌ని ప్ర‌చారం చేయిస్తున్నారు.. అది కూడా పార్టీలో కాస్త లూజ్ గా ఉండే నాయ‌కులు, టంగ్ స్లిప్ అయ్యే కేడ‌ర్ ని గుర్తించి వారి ద్వారా ఈ ప్ర‌చారం చేయిస్తున్నారు..ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీలో వంద మంద‌కి స‌మాధానం చెప్పేలా చెల‌రేగుతారు తెలుగుదేశం పై.. అందుకే వారిని దెబ్బ‌కొట్టేలా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది.. వీటిపై తెలుగుదేశానికి కూడా వీరు పంచ్ లు వేస్తున్నారు.. ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇరికించినా వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలుసు అని ఎదురుతిరుగుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.