బలవంతంగా మేకపాటి ఆస్పత్రికి తరలింపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

 ycp mp mekapati rajamohan reddy
Updated:  2018-04-07 05:59:06

బలవంతంగా మేకపాటి ఆస్పత్రికి తరలింపు

ప్రత్యేక హోదా కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేస్తున్న అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌ మేర‌కు పార్ల‌మెంట్  స‌భ స‌మావేశం చివ‌రి రోజున వైసీపీ ఎంపీలు వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి స్పీక‌ర్ కు స‌మ‌ర్పించారు..ఆ త‌ర్వాత‌ ఢిల్లీ ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే..  ఈ రోజు తెల్ల‌వారు జామున కురిసిన వ‌ర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా దీక్ష చేట్టారు వైసీపీ ఎంపీలు.
 
వ‌ర్షంలో త‌డుస్తూ దీక్ష చేట్టిన ఎంపీల‌ ఆరోగ్యం పూర్తి స్థాయిలో క్షీణించిపోవ‌డంతో వారికి ఈ రోజు ఉద‌యం వైద్యులు చికిత్సలు అందించారు.. చికిత్స అందించిన‌ డాక్ట‌ర్లు వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు..అయినా కానీ తాము ప్ర‌త్యేక హోదాకోసం ఎంత‌టిదాక అయినా పోరాడుతామ‌ని, దీక్ష‌ను విర‌మించ‌కుండా య‌దావిధిగా కొన‌సాగించారు వైసీపీ ఎంపీలు..
 
అయితే ఈ దీక్ష‌లో మేక‌పాటీ ఆరోగ్యం పూర్తి స్థాయిలో విష‌మించి పోవ‌డంతో ఈ రోజు ఉద‌యం నుంచి తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పి, హైబీపీతో ఆయన బాధ ప‌డుతుండ‌డంతో వేంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని డాక్ట‌రు పోలీసుల‌కు సూచించారు... దీంతో ఆయ‌న‌ను పోలీసులు స‌హ‌కారంలో వైద్యులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.