వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే ? నాని - రాధా స‌క్సెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Former-MLA-of-the-ycp-Nani-Radha-Success
Updated:  2018-03-31 11:25:43

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే ? నాని - రాధా స‌క్సెస్

గుంటూరు జిల్లా నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంట‌ర్ అయ్యేందుకు మార్గ‌మ‌ధ్య‌లో ఉంది.. ఇక తెలుగుదేశం పార్టీ కంచుకోట‌గా చెప్పుకునే గుంటూరు కృష్ణాలో జ‌గ‌న్  పాద‌యాత్ర అన‌గానే తెలుగుదేశం డైల‌మాలోకి వెళ్లింది... ఇక గుంటూరులో జ‌గ‌న్ కు జ‌న సంద్రోహం చూసి అవాక్కైంది తెలుగుదేశం పార్టీ.. తాజాగా ఆయ‌క కృష్ణా జిల్లాలో ఎంట‌ర్ అవగానే, టీడీపీకి ఓ పెద్ద షాక్ ఇవ్వ‌నుంది వైసీపీ....తొలిరోజే ఓ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేర‌నున్నారు..
 
2009 ఎన్నిక‌ల్లో య‌లమంచిలి ర‌వి విజ‌య‌వాడ ఈస్ట్ నుంచి పీఆర్పీ త‌ర‌పున పోటీ చేశారు.. ఆయ‌న దేవినేని నెహ్రూని ఓడించి గెలుపొందారు.. త‌ర్వాత చిరంజీవి కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేయ‌డంతో, రాజ‌కీయంగా ర‌వి త‌ర్వాత తెలుగుదేశంలో చేరారు. అయితే పార్టీలో చేరే స‌మ‌యంలో విజ‌యవాడ ఈస్ట్ సీటు 2014 ఎన్నిక‌ల్లో ర‌వికి ఇస్తారు అని అంద‌రూ అనుకున్నారు.... తెలుగుదేశం పార్టీలో ప‌లు  స‌మీక‌ర‌ణాల దృష్ట్యా బాబు గద్దె రామ్మోహన్‌కు టికెట్  ఇచ్చారు.
 
అయితే పార్టీ ఇక్క‌డ‌ గెలిచిన త‌ర్వాత ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ర‌వికి పార్టీ ఏదైనా ప‌ద‌వి ఇస్తుంది అని అనుకున్నారు. అయితే పార్టీ ర‌విని గుర్తించ‌డం మానేసింది... జిల్లాలోనే కాదు విజ‌య‌వాడ‌లో జ‌రిగే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా పిలుపు రావ‌డం లేదు, దీంతో పార్టీలో ఆయన ఇమ‌డ‌లేక పార్టీ మార‌డానికి సిద్దంగా ఉన్నారు అని గ‌త ఆరు నెల‌లుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అప్ప‌టి నుంచి తెలుగుదేశం ఆయ‌న్ని బుజ్జగిస్తూనే ఉంది.
 
ఇక య‌ల‌మంచిలి ర‌వికి ఎంపీ సుజ‌నా చౌద‌రి బంధువు ఆయ‌న రాయ‌భారం చేసినా ర‌వి మాత్రం పార్టీ వీడ‌టానికే సిద్దం అయ్యారు... ఇక తాను తెలుగుదేశంలో కొన‌సాగ‌లేను అని తెలియ‌చేశారు.. అలాగే  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వంగ‌వీటి రాధాల‌తో ర‌వికి మంచి సాన్నిహిత్యం ఉంది ఇప్ప‌టికే వారి ఇరువురితో పార్టీలో చేరేందుకు చ‌ర్చించారు అని తెలుస్తోంది..ఏప్రిల్ 10 వ తేదిన  జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఆయ‌న వైసీపీలో చేరుతారు అని తెలుస్తోంది..అయితే విజ‌యవాడ ఈస్ట్ ఆయ‌న‌కు ప‌క్కా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది పార్టీ త‌ర‌పున‌.

షేర్ :

Comments

1 Comment

  1. Super

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.