వైసీపీలో చేర‌నున్న గాదిరాజు సుబ్బరాజు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 17:32:36

వైసీపీలో చేర‌నున్న గాదిరాజు సుబ్బరాజు

వైయ‌స్ జ‌గ‌న్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర అనేస‌రికి పార్టీలో ఒక్కసారిగా నూత‌న ఉత్తేజం మ‌రింత వ‌చ్చింది జిల్లా నాయ‌కుల‌కు.. ఈ నెల‌13 న సాయంత్రం జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణా నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రిలోకి ఎంట‌ర్ అవ‌నుంది.
 
తాజాగా మీడియా స‌మావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ తీరుతో మోసపోయిన పశ్చిమ ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పాదయాత్రలో కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం జ‌గ‌న్ కు జిల్లా నాయ‌కులు స్వాగ‌తం ప‌లుకుతార‌ని తెలియ‌చేశారు.
 
అలాగే మే 14న వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ఏలూరు సమీపంలో వెంకటాపురం వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుంది అని తెలియ‌చేశారు.. అక్క‌డ ప్ర‌జ‌లు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య జ‌గ‌న్ 40 అడుగుల పైలాన్ ఆవిష్క‌రిస్తారు అని తెలియ‌చేశారు ఆయ‌న‌.
 
అలాగే  14వ తేదీ సాయంత్రం ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది. పశ్చిమలో 13 నియోజకవర్గాల్లో దాదాపుగా 250 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఉంటుంది అన్నారు. ఇక ప‌శ్చిమ‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చేరిక‌లు ఉంటాయి అని, ఇప్ప‌టికే ప‌లు వార్త‌లు వినిపించాయి. 
 
తాజాగా మొద‌ట చేరే నాయ‌కుడి పేరు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు.. భీమవరానికి చెందిన గాదిరాజు సుబ్బరాజు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతారు  అని తెలియ‌చేశారు. ఇటు మ‌రో ఇద్ద‌రు కాంగ్రెస్ మాజీలు కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది అంటున్నారు జిల్లా నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.