జ‌న‌సేనలోకి తొలిసారి మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-30 14:55:28

జ‌న‌సేనలోకి తొలిసారి మాజీ ఎమ్మెల్యే

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో విశాఖ‌లోని రాజ‌కీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. కొద్దిరోజుల‌క్రితం ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న అనుకూల మీడియా ద్వారా స‌ర్వే నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వే ప్ర‌కారం విశాఖలో టీడీపీకి కంచుకోట‌గా వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం. అయితే ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గంటా శ్రీనివాస‌రావు టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొన‌సాగుతున్నారు.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌లకు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని ఎల్లో మీడియా తెలుప‌డంతో ఆయ‌న అల‌క‌ చెందారు. ఈ క్ర‌మంలో గంటా వైసీపీలోకైనా జ‌న‌సేనలోకైనా వెళ్లే ఆస్కారం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ విష‌యంలో జోక్యం చేసుకుని ఆయ‌న‌కు స‌ర్థిచెప్పి బుజ్జ‌గించే కార్య‌క్రమం చేశారు. ఇక ఈ విష‌యం మ‌రువ‌క ముందే విశాఖ‌లో మ‌రో సంచ‌ల‌న‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది.
 
విశాఖ‌లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జ‌న‌సేన పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి వెంకట్రామయ్యను పార్టీలోకి ఆహ్వానించారు. ప‌వ‌న్ పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి ఇంత వ‌ర‌కు మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యేలు కానీ జ‌న‌సేనలోకి చేర‌లేదు. మొద‌టి సారిగా చింతలపూడి వెంకట్రామయ్య జ‌న‌సేన‌లోకి చేర‌డం విశేషంగా మారింది.
 
గ‌తంలో ఆయ‌న చిరంజీవి పార్టీ స్థాపించిన‌ప్పుడు గాజువాక నుంచి పోటీ చేసి ప్ర‌జారాజ్యం త‌ర‌పున గెలిచారు. ఆ త‌ర్వాత ఈ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. ఇక అప్ప‌టినుంచి చింతలపూడి వెంకట్రామయ్య గంటా శ్రీనివాస రావుకు మంచి స‌న్నిహితుడుగా ఉండేవారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.