గాలికి క్లీన్ చీట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-02 01:17:46

గాలికి క్లీన్ చీట్ ?

మొత్తానికి సీబీఐ కొన్ని విషయాల్లో చేతులెత్తేస్తోంది అంటున్నారు మేధావులు, సీనియ‌ర్ లాయ‌ర్లు, సీనియ‌ర్ అన‌లిస్టులు... దేశంలో ఎంతో సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేశారు క‌ర్నాట‌క బీజేపీ నేత గాలిజ‌నార్ద‌న్ రెడ్డి... మైనింగ్ కింగ్ పై సీబీఐ అక్ర‌మ మైనింగ్ విష‌యంలో చేతులు ఎత్తేసింది అంటున్నారు... ఎందుకంటే ఆయ‌న పై ఉన్న కేసులు దాదాపు క్లోజ్ అయ్యే స్దితికి వచ్చాయి అని తెలుస్తోంది... తాజాగా 2017 చివర్లో సీబీఐ దాఖలు చేసిన ప్రమాణ పత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.... దీంతో ఇక ఈ కేసులో గాలికి క్లీన్ చీట్ ఖాయం అని అంటున్నారు.
 
సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని కొన్ని వ్యాఖ్యలు చూసిన తర్వాత…. ఇక గాలి జనార్దన్‌ రెడ్డిపై కేసులు మోపడం దాదాపు అసాధ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దానికి గ‌ట్టి వాద‌న కూడా చేస్తున్నారు...సీబీఐ గతేడాది ఆఖర్లోనే ఈ అఫిడవిట్‌ దాఖలు చేసినా అది ఇంతకాలంగా గోప్యంగానే ఉంది... దాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్‌ వెలుగులోకి తెచ్చారు. ఆ వివ‌రాలు ప‌రిశీలించిన‌ట్టు  అయితే ?
 
గాలి జనార్దన్ రెడ్డి ఎంతమేర మైనింగ్ చేశారు…. ఎక్కడెక్కడ చేశారు…. ఎక్కడికి తరలించారు అలాంటివి ఏమీ  నిరూపించడం సాధ్యమయ్యే పని కాదని.... న్యాయస్థానానికి 2017 ఆఖరిలో  సీబీఐ తన ప్రమాణపత్రంలో తెలియజేసింది. 
 
అయితే ఆరోప‌ణ‌ల‌తో,  ఆయ‌న అక్ర‌మమైనింగ్ కేసు కూడా ఫైల్ చేసింది.. అదే విష‌యం పై ఇక సీబీఐ ఆ విష‌యం ఎంత విచార‌ణ చేసినా తేల‌దు అని చెప్ప‌డంతో ఆయ‌న కేసు వీగిపోవ‌డం ఖాయం అని సీనియ‌ర్ న్యాయ‌నిపుణులు తెలియ‌చేస్తున్నారు... సీబీఐ తాము విచార‌ణ‌లో ఎటువంటివి తేల్చ‌లేము అని చెప్ప‌డం ఇక విచార‌ణ సంస్ద‌లు చేతులెత్తేయంతో కోర్టులు కూడా ఏమీ చేయ‌లేవు అని అంటున్నారు న్యాయ‌నిపుణులు.
 
 అయితే ఈ విష‌యం పై సీబీఐ దాఖలు చేసిన పత్రాలను సీనియర్ జర్నలిస్ట్‌ బర్ఖాదత్‌ ట్వీట్ చేశారు.  నిజానికి గాలి జనార్దన్ రెడ్డి విచారణ ఖైదీగానే దాదాపు నాలుగేళ్లు జైలులో ఉండిపోయారు. ఇక కేసు పై తీర్పు వ‌చ్చినా ఆయ‌న‌కు ఇంత‌కంటే ఎక్కువ జైలు శిక్ష కూడా ప‌డే అవ‌కాశం లేదు అని అంటున్నారు న్యాయ‌నిపుణులు.
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.