మ‌ళ్లీ స‌త్తా చాటిన గాలి ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 14:59:13

మ‌ళ్లీ స‌త్తా చాటిన గాలి ?

బ‌ల్లారి మైనింగ్ కింగ్ అంటే వెంట‌నే  క‌ర్నాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ధ‌న్  రెడ్డి పేరు గుర్తువ‌స్తుంది.. గాలి జ‌నార్ధన్  రెడ్డి  అంటే తెలియ‌ని వారు ఉండ‌రు బీజేపీకి క‌రుడుగట్టిన అభిమాని ఆయ‌న,  అలాగే మాజీ మంత్రిగా కూడా ఆయ‌న ఉన్నారు.ఇక కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డ గాలి హవా క‌నిపించ‌లేదు... పైగా జైలుకు వెళ్ల‌డం అక్క‌డ మైనింగ్ కేసులు ఆయ‌న్ని చుట్టుముట్ట‌డంతో గాలి జనార్ధ‌నరెడ్డి జైలు జీవితం గ‌డిపారు... ఇక బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన గాలి జ‌నార్దన రెడ్డి పై  కాంగ్రెస్ విమ‌ర్శ‌లు చేసినా బీజేపీ ఆచితూచి అడుగులు వేసింది..
 
అలాగే దానిపై ఎటువంటి కామెంట్లు చేయ‌లేదు బీజేపీ నాయ‌కులు..అయితే రాజ‌కీయంగా క‌ర్నాట‌క‌లో  ఎన్నిక‌లు ఉన్న సంద‌ర్బంగా ఆయ‌న్ని బీజేపీ ప‌క్క‌న పెట్టింది... ఈ ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పుదాము అనుకున్న గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి  బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా గ‌తంలో షాక్ ఇచ్చారు... ఆయ‌న కు  మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు.
 
అయితే అమిత్ షా కామెంట్లు గాలి కేడ‌ర్ లో బాధ‌ను మిగిల్చాయి... తాజా రాజ‌కీయ  క‌న్న‌డ ప‌రిణామాలు ప‌రిశీలిస్తే,  తాజాగా కర్నాట‌క  బీజేపీ, ఈ ఎన్నిక‌ల్లో  ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేసింది. అయితే ఇందులో గాలి అనుచ‌రుల‌కు ఆయ‌న కోట‌రీలో ఉన్న నాయ‌కులు అంద‌రికి  టిక్కెట్లు ల‌భించాయి... దీంతో అంద‌రూ ఇప్పుడు ఇదే చ‌ర్చించుకుంటున్నారు.
 
ఓ ప‌క్క‌న గాలికి తాము త‌మ పార్టీకి సంబంధం లేదు అని చెబుతూనే ఆయ‌న కేడ‌ర్ కు ఎలా సీట్లు ఇచ్చారు అని ప్ర‌శ్నిస్తున్నారు.. ఇవి  తెర వెనుక ఒప్పందాలు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి... గాలికి అత్యంత సన్నిహితుడైన బళ్లారి ఎంపీ శ్రీరాములుకు మొళకాల్మూరు టికెట్‌ను కేటాయించారు..  
 
అలాగే  గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డికి బళ్లారి సిటీ టికెట్‌ కేటాయించారు. బళ్లారి టికెట్‌ను సణ్ణఫక్కీరప్పకు, సిరిగుప్ప టికెట్‌ను ఎం.ఎ్‌స.సోమలింగప్పకు, హగరిబొమ్మనహళ్లి టికెట్‌ను నేమిరాజ్‌ నాయక్‌కు కేటాయించారు. మొళకాల్మూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని శ్రీరాములును బరిలోకి దించడంతో ఆయన వర్గీయులు తిరుగుబాటు లేవనెత్తారు.
 
శ్రీరాములును ఓడించి తీరతామని తిప్పేస్వామి శపథం పూనారు.. మొత్తానికి వెనుక నుంచి గాలి రాజ‌కీయాలు చేస్తున్నారు అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి... మ‌రి దీనిపై కాంగ్రెస్ కూడా కొత్త ఎత్తుగ‌డ వేస్తోంది అని తెలుస్తోంది.. మ‌రో నెల రోజుల్లో ఇక్క‌డ ఐదు ఏళ్లు చ‌క్రం తిప్పేది ఎవ‌రో తేల‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.