గాలి చివ‌రిగా కోరిన కోరిక

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 02:39:46

గాలి చివ‌రిగా కోరిన కోరిక

తాను ఇక‌ ఎక్కువ సేపు  బతకలేనని  ముందే తెలిసిపోయిందో ఏమో.. తన చివరి క్షణాల్లో ఒకే ఒక్క వ్యక్తి గురించి అడిగాడు.. త‌న‌ని పిలింపించ‌మ‌ని ఎంతో ఆశ‌గా అడిగాడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు. అతను ఎవరో కాదు.... గాలికి  న‌మ్మిన బంటు....  20 సంవత్సరాలుగా తన వాహన డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న చంద్ర.
gali muddu krishnama naidu
 
 ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే చంద్రను పిలిపించమని ముద్దుకృష్ణమ కోరినట్లు తెలిసింది. ఆయ‌న కుటుంబ సభ్యుల సూచన మేరకు మంగళవారం మధ్యాహ్నం విమానంలో చంద్ర హైదరాబాద్‌కు చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ముద్దుకృష్ణమను చూసి కుప్పకూలారు చంద్ర‌. అయ్యా..!లే అయ్యా..! ఎంతమంది జనం వచ్చారో చూడయ్యా.. ! అంటూ భౌతికకాయం వద్ద చంద్ర రోదించడం అక్క‌డ ఉన్న వారిని  కంట తడి పెట్టించింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.