వైసీపీలోకి గల్లా అరుణ‌కుమారి....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-06 17:35:11

వైసీపీలోకి గల్లా అరుణ‌కుమారి....

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి ఫాక్ ల మీద షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు మూటా ముళ్లు స‌ర్ధుకుని జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌నే వార్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టికే టీడీపీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులంద‌రూ పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకుని ఆయ‌న స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఇదే క్ర‌మంలో టీడీపీ ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారట‌. అయితే ఇప్ప‌టికే క‌ర్నూల్ జిల్లా బ‌న‌గానప‌ల్లె టీడీపీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న రెడ్డి వైసీపీలో చేరేందుకు ముందంజలో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే  ఇంత వ‌ర‌కూ ఆయ‌న పార్టీ మార‌డంపై ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. దీంతో ఈయ‌న వైసీపీలో చేరడం ఫిక్స్ అంటున్నారు జిల్లావాసులు. ఇక ఆయ‌న తోపాటు రాజ‌కీయ‌ సీనియ‌ర్ నాయ‌కులు చ‌ల్లా కూడా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.
 
అయితే ఈ క్ర‌మంలో గల్లా అరుణ కుమారి కూడా వైసీపీలో చేరేందుకు రెడి అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌ల్లా ఫ్యామిలీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో కాంగ్రెస్ త‌ర‌పున కీల‌క బాధ్య‌త‌లను పోషించారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న అనంత‌రం గ‌ల్లా ఫ్యామిలీ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. 
 
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజ‌కవ‌ర్గం నుంచి గ‌ల్లా అరుణకుమారి పోటీచేశారు. అలాగే ఈమెతో పాటు ఆమె తనయుడు గల్లా జయదేవ్ కూడా గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే అరుణకుమారి త‌న సొంత నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌త్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని ఓడించ‌లేక పోయారు. అయితే ఆమె త‌న‌యుడు జ‌య‌దేవ్ మాత్రం గుంటూరులో టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
 
ఇక జ‌య‌దేవ్ విష‌యం ప‌క్క‌న పెడితే...అరుణ కుమారి 2019 ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ త‌ర‌పున చంద్ర‌గిరిలోనే పోటీ చేస్తార‌ని జిల్లా వాసులంద‌రూ అనుకున్నారు. కానీ ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె టీడీపీ కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంతోనే కొన్నాళ్ల కిందట త‌న‌ను చంద్రగిరి ఇన్ చార్జి పదవి నుంచి తప్పించాలని కోరుతూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు గల్లా అరుణకుమారి. కానీ చంద్ర‌బాబు నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్రమంలో ఆమె వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యార‌ట‌. 
 
ఇక ఇదే క్ర‌మంలో గల్లా జ‌య‌దేవ్ కూడా వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు వ‌స్తున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గుంటూరు జిల్లాలో టీడీపీ ప్ర‌భావం ప్ర‌జ‌ల్లో ఎలా ఉందో అని తెలుసుకునేందుకు ఓ ర‌హ‌స్య స‌ర్వేను నిర్వ‌హించారట‌. అయితే ఈ సర్వేలో టీడీపీ క‌చ్చితంగా ఓట‌మి పాలు కావ‌డం ఖాయం అని తేలింద‌ట‌. దీంతో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అయ్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వైసీపీలో చేరిక‌పై గల్లా ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. 
 
ఒక వేళ జ‌య‌దేవ్ వైసీపీలో చేరితే ఇటు టీడీపీ కంచుకోట బ‌ద్ద‌లు అవ్వ‌డం ఖాయం, అటు గ‌ల్లా అరుణ‌కుమారి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరితే చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీ బీట‌లు వాల‌డం ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు. చూద్దాం ఇంకా సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఏడాది స‌య‌మం ఉంది ఈ లోపు వీరిద్ద‌రు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరుతారా అన్న‌ది ఆసక్తిగా మారుతోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.