బాబుకు గల్లా షాక్?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 11:53:46

బాబుకు గల్లా షాక్?

గల్లా అరుణ కుమారి తండ్రి రాజగోపాల్ నాయుడు నుండి రాజకీయాలలో ఉంది ఆ ఫ్యామిలీ...రాజగోపాల్ నాయుడు స్వతంత్ర సమరయోధుడు...స్వత్నత్రోద్యమం కోసం పాటు పడిన వ్యక్తి...రెండు సార్లు పార్లమెంట్ కి  కూడా వెళ్లారు రాజగోపాల్ నాయుడు...ఈయన చంద్రబాబు నాయుడుకు రాజకీయ గురువు...చంద్రబాబు రాజకీయ ఓనమాలు నేర్చుకుంది ఈయన దగ్గరే...అయన తర్వాత రాజకీయ వారసత్వంగా గల్లా అరుణ కుమారి రాజకీయాల్లోకి వచ్చారు...ఆమె కూడా చిత్తూరు రాజకీయాలలో మంచి పేరు తెచ్చుకున్నారు...
 
గల్లా అరుణ కుమారి సుమారు 35 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు...అందులో 30 సంవత్సరాలు పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు...దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేసారు గల్లా అరుణ కుమారి...రాష్ట్రా విభజన జరిగిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2014 లో టీడీపీలో జాయిన్ అయ్యారు...2014 ఎన్నికలలో చంద్రగిరి నుండి పోటీ చేసిన ఆమె చవి రెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు...
 
ఇప్పుడు చంద్రబాబును కలిసి బాబుకు షాక్ ఇచ్చారు గల్లా అరుణ కుమారి...వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేయనని చెప్పారు...అంతేకాకుండా నా కుమార్తె రమాదేవికి కూడా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసారు గల్లా అరుణకుమారి...దానికి కారణం లోకేష్ అని చెప్పారని సమాచారం...పంచాయతీ, జన్మభూమి, నీరు చెట్టు కార్యక్రమం ఇలా అన్నింట్లో లోకేష్ తలదూరుస్తున్నాడని చెప్పారని సమాచారం...పంచాయతీ స్థాయి కార్యకర్తల నుండి అందరు ఎంపీ శివప్రసాద్ సాయంతో లోకేష్ తో మంతనాలు జరుపుతున్నారని తెలియజేసారు...నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య సమన్వయం లేదని చెప్పారని తెలుస్తుంది...
 
అంతేకాకుండా టీడీపీ పైన కూడా ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేఖత పెరిగిపోతుంది...టీడీపీ ఇచ్చిన తప్పుడు హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి...ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ చేస్తున్న యూ-టర్న్ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు...మరో వైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు...వచ్చే ఎన్నికలలో టీడీపీ తరపున బరిలోకి దిగితే ఓటమి ఖాయం అని భావించి ఈ నిర్ణయం గల్లా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు....

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.