వైసీపీలోకి రీ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 15:08:09

వైసీపీలోకి రీ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ ?

కొణ‌తాల రామ‌కృష్ణ శిష్యుడు విశాఖ రాజ‌కీయాల్లో ఎమ్మెల్యేగా చ‌క్రం తిప్పిన వ్యక్తి ,గ‌తంలో తాను కాద‌నుకున్న వైసీపీలోకి మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఆయ‌నే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ... నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌తో ఆయ‌న ఆత్మీయ స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు... ఈ స‌మావేశాల‌కి వైసీపీ నాయ‌కుల‌కు ఆహ్వ‌నాలు అందాయి..   పెందుర్తి తెలుగుదేశం కేడ‌ర్  త‌న‌కు ప్ర‌యారీటి ఇవ్వ‌డంలేద‌ని, కొంత కాలంగా విచారంగా ఉన్నారు బాబ్జీ.. దీంతో ఇప్పుడు ఆయ‌న వైసీపీలోకి మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలి అని భావించారు అని తెలుస్తోంది.
 
2004 అసెంబ్లీ ఎన్నికల్లో పరవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాబ్జీ నియోజకవర్గాల పునర్విభజన త‌ర్వాత‌ 2009 ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో ఇదే నియోజవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు.. త‌ర్వాత వైసీపీలో కొద్ది నెల‌లు ఉండి... త‌ర్వాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
 
ఇక సీనియ‌ర్ గా పెందుర్తి నుంచి ఉన్న బండారు స‌త్యనారాయ‌ణ‌కు  వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం టిక్కెట్ ఇచ్చేలా ఉంది.... ఇక ఈ స‌మ‌యంలో తెలుగుదేశంలో ఉన్నా త‌న‌కు సీటు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని మ‌రో సంవ‌త్స‌రంలో ఎన్నిక‌లు ఉండ‌టం జిల్లా నాయ‌కులు కూడా వైసీపీలో ఆయ‌న ఎంట్రీకి సుముఖ‌త చూప‌డం, అలాగే బండారు స‌త్య‌నారాయ‌ణ వ‌ర్గంతో వ‌ర్గ‌పోరుతో కొన‌సాగ‌లేక పార్టీ మారాలి అని ఆయ‌న పై కేడ‌ర్ ఒత్తిడి తెస్తోంద‌ని తెలుస్తోంది..
 
పెందుర్తి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్‌గా అదీప్‌రాజ్‌ ఉన్నారు. ఆయన గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే పార్టీలో చేరితే జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక మంత్రి అయ్య‌న్న‌పాత్రుడి వ‌ర్గంగా ఉన్న ఈయ‌న వైసీపీకి వెళ్ల‌కుండా అయ్య‌న్న వ‌ర్గంనిలుపుద‌ల చేస్తుందా అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.