గంటా శాఖ అవినీతి శాఖ ఇదిగో సాక్ష్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:50:10

గంటా శాఖ అవినీతి శాఖ ఇదిగో సాక్ష్యం

ఏపీ అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు మ‌రో పెద్ద‌ అవినీతికి రంగం సిద్ద చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాఠ‌శాలల్లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు స‌ర్కార్ హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ ప‌థ‌కానికి అమ‌లు చేశారు. ఈ ప‌థ‌కం కింద సుమారు 4 వేల 848 కోట్ల‌ను మంజూరు చేసింది ఏపీ స‌ర్కార్. ఇందులో కాంట్రాక్ట‌ర్ల‌కు 60  శాతం ప్ర‌భుత్వం 40 శాతం వెచ్చింది. రెండెళ్ల‌లోపు ప్ర‌తీ పాఠ‌శాల‌లో మౌళిక వ‌స‌తుల‌ను క‌ల్పించాల‌న్న‌ది ఈ ప‌థ‌కం యెక్క ముఖ్య ల‌క్ష్యం. ఇందులో వివిధ పాఠ‌శాల‌ల్లో16 వేల 785 త‌ర‌గ‌తుల గ‌దుల‌ నిర్మాణం, అలాగే 20 వేల 800 మ‌రుగుదోడ్లు, 40 వేల 665 క్లాస్ రూమ్స్ అలాగే ఫ‌ర్నీచ‌ర్ స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్నారు.
 
దీంతో పాటు 3 వేల 629 పాఠ‌శ‌ల‌ల‌కు మంచినీటి స‌దుపాయం, 2 వేల 417 గ్రంధాలాయాల‌ను నిర్మంచేందుకు ఈ ప‌థ‌కాన్ని రూపొందించారు. అయితే వారు కేటాయించ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా పోయిన సంవ‌త్స‌రం ఈ ప‌థ‌కం ఆమోదం పొందిన త‌ర్వాత ఆగ‌స్ట్ 15 వ‌తేదీన ఏపీ స‌ర్కార్ 4 వేల 848 కోట్ల ప్రాజెక్ట్ కు అనుమ‌తి ఇస్తూ ఒక జీవోను జారీ చేశారు. ఇక ఇప్పుడు ఈ ప‌నుల‌కు టెండ‌ర్స్ ను కూడా అధికారులు ఆహ్వానించారు. 
 
ఆ టెండ‌ర్స్ వ్య‌వ‌హారంలోనే భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. అంతేకాదు యూనిట్ కాస్ట్ ను అధికారులు పెద్ద గోల్ మాల్ చేస్తున్నారు. స‌ర్వ‌శిక్షా అభియాన్ కింద‌ నిర్మించే త‌ర‌గ‌తుల యూనిట్ కాస్ట్ ను ప్ర‌తీ ఏట కేంద్రం నిర్ణ‌యిస్తుంది. అందులో భాగంగానే గ‌త సంవ‌త్స‌రం కేంద్ర ప్ర‌భుత్వం 9 ల‌క్ష‌లుగా నిర్ధారించారు. కానీ ఈ హైబ్రీడ్ మోడ్ లో టీడీపీ స‌ర్కార్ యూనిట్ కాస్ట్ ను ఏకంగా  14 ల‌క్ష‌లకు పెంచేశారు. 
 
అంటే ద‌రిదాపు టీడీపీ నాయ‌కులు 30 శాతం దోపిడీకి ప‌క్కాగా స్కెచ్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ దోపిడికి క్యాబినెట్ కూడా ఆమోదించింది. ఈ స్కెచ్ కు టీడీపీ స‌ర్కార్ ఎస్ ఎస్ ఆర్ రీప్లే కింద క‌ల‌ర్ ప్లేట్ల‌కు మ‌సిపూసేసి అవినీతికి పాల్ప‌డ్డారు. అందులో ఆశ్చ‌ర్యం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో 60 శాతం కాంట్రాక్టర్లు రుణం తీసుకు రావాలి. అయితే దాని మీద కూడా 10 శాతం మొబ‌లైజేష‌న్ ఇవ్వ‌డానికి  ప్ర‌భుత్వం అంగీకరించ‌డం విశేషం. 
 
అయితే గ‌తంలో ఏ ప్రాజెక్ట్ కు ఇలా జ‌రుగ‌లేదు. దీనిని బ‌ట్టి చూస్తుంటే కాంట్రాక్ట‌ర్ట‌కు 60 శాతానికి త‌గ్గి లాభం చేకూరుతోంది. దీంతో పాటు ఫ‌ర్నీచ‌ర్ అంశాల‌ను కూడా మార్చేశారు. మార్కెట్ ధ‌ర‌ల కంటే 15 శాతం పెంచేశారు. ఇలా ప్రాజెక్ట్ రూప‌క‌ల్ప‌న‌లోనే దాదాపు 1000 కోట్ల‌కు పైగా ప‌క్క‌దారి మ‌ళ్లించేందుకు ప‌క్కా ప్లాన్ వేశారు. 6 ప్యాకేజీల‌కు టెంట‌ర్ల‌ను పిల‌వ‌గా కేవ‌లం 8 కాంట్రాక్ట‌ర్ల‌ను మాత్ర‌మేబిడ్స్ ను ధాఖ‌లు చేసేలా చేశారు. అయితే వారు కూడా సిండికేట్  అయిపోయారు.
 
ప్రాజెక్ట్ ధ‌ర కంటే 15 శాతం అధ‌నంగా టెండ‌ర్స్ ను దాక‌లు చేశారు. వారు అధిక మొత్తానిక టెండ‌ర్స్ వేయ‌డంతో స‌ర్కార్ వాటిని ర‌ద్దు చేసి రీ టెండ‌ర్ల‌ను పిల‌వాల‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు ప్ర‌క‌టించారు. టెండ‌ర్స్ ను ర‌ద్దు చేసినా అస‌లు అంచాల్లో గోల్ మాల్ జ‌రిగింది. ఇటీవ‌లే గంటా అల‌క వెనుక కూడా ఈ ప్రాజెక్ట్ వ్య‌వ‌హారం ఉన్న‌ట్లు తెలుస్తోంది. సుమారు మూడు నెలల పాటు సీఎం కార్యాలయం దీన్ని పెండింగ్ పెట్టింది. దీంతో మంత్రికి కోపం వ‌చ్చింద‌ని ఇప్పుడు అల‌క వీడ‌గానే ఈ ప్రాజెక్ట్ టెండ‌ర్స్ ప్ర‌క్రియ వేగంగా సాగిపోతుంద‌ని ఏపీ స‌చివాలయంలో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రో ప‌ది రోజుల్లో ఈ టెండ‌ర్స్ ను ఇచ్చేయ‌డానికి రంగం సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.